కృష్ణ

నాటి దివిసీమ ఉప్పెనను నేటికీ మరువలేను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవనిగడ్డ : 1977 ఉప్పెన దివిసీమ వాసులకు ఒక అనుభవాన్ని నేర్పిందని, అదే తరహాలో ఉవ్వెత్తున సేవా తత్పరతకూడా అలవర్చుకునేందుకు దోహదపడిందని నాటి జిల్లా పోలీసు సూపరింటెండెంట్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఎస్ వీర నారాయణరెడ్డి అన్నారు. సోమవారం స్థానిక గాంధీ క్షేత్రంలో జరిగిన ఉప్పెన, తుఫాన్ మృతుల 41 సంస్మరణ సభలో ఆయన ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వీర నారాయణరెడ్డి మాట్లాడుతూ ఆ ఘోర కలి చలింప చేసిందని, ప్రత్యక్షంగా తాను చూడటం జరిగిందని, పోలీసు శాఖ తరపున సొర్లగొంది గ్రామాన్ని దత్తత తీసుకుని పునః నిర్మాణం చేయటం జరిగిందని గుర్తు చేశారు. 20వ శతాబ్దంలోనే అది ఘోరమైన తుఫాన్, ఉప్పెనగా పేర్కొన్నారు. బందరు, దివిసీమ ప్రాంతాలలో ఆ ఘోర కలి చవి చూడటం జరిగిందన్నారు. ఆ కారణంగానే అనేక స్వచ్ఛంద సంస్థలు, మత సంస్థలు సేవలు అందించేందుకు మందుకు రావటం జరిగిందన్నారు. సొర్లగొందిని దత్తత తీసుకోవటంతో పోలీసులు అహర్నిశలు శ్రమించారని, ఇలాంటి విపత్తులకు ప్రాణ నష్టం లేకుండా తర్వాత చర్యలు తీసుకోవటం జరిగిందన్నారు. సభకు అధ్యక్షత వహించిన ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ మదర్ థెరీస్సా, డిల్లీగ్రహం అమెరికా నుండి నిధులు తీసుకురావటం ద్వారా అనేక అభివృద్ధి పనులు చేశారన్నారు. అప్పటి రాష్టప్రతి నీలం సంజీవరెడ్డి సొర్లగొంది, గొల్లపాలెం, డీల్లీగ్రాంలో పర్యటించటం ద్వారా ప్రపంచ దేశాలకు విపత్తు తెలిసిందన్నారు. ఎన్టీఆర్, ఎఎన్‌ఆర్ రావటం ద్వారా 16వేల గృహాలు నిర్మాణానికి దోహదపడ్డారని, గుల్లలమోదలో తుఫాన్ షెల్టర్ నిర్మించారని, గెల్లెలమూడి అమ్మగారు, ప్రభాకర్‌జీ తదితరులు గ్రామాల పునః నిర్మాణంలో ఎంతో కృషి చేశారన్నారు. ఈ సందర్భంగా ఆళ్వార్ దాస్ రచించిన ఆపద్బంధు అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. అలాగే సేవలకు అన్ని మతాలు కల్పించాయన్నారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఎస్పీ వీర నారాయణరెడ్డి, తిలక్, దాసరి ఆళ్వార్ స్వామిలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు సజ్జా గోపాలకృష్ణ, కనకదుర్గ, జయలక్ష్మి, మండవ బాలవర్ధిరావు, రావి నాగేశ్వరరావు, కొల్లూరి వెంకటేశ్వరరావు, బచ్చు వెంకట నాధ ప్రసాద్, మండలి రాజా, మాచర్ల భీమయ్య తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు రూ.7.5లక్షల వ్యయంతో నిర్మించిన చేపల మార్కెట్ భవనాన్ని బుద్ధప్రసాద్ ప్రారంభించారు. ఉప్పెన మృతులకు సభలో రెండు నిమిషాలు వౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు.