కృష్ణ

కలెక్టర్‌కు ఘన సన్మానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, : సంక్షేమ రంగంలో జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిపి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా సత్కారం పొందిన జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతంను సోమవారం జిల్లా అధికార యంత్రాంగం ఘనంగా సత్కరించింది. కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీకాంతంను గజమాలలు, దుశ్శాలువాలతో సత్కరించారు. సంక్షేమ రుణాల మంజూరుతో పాటు భూదార్‌లో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. అలాగే విజయవాడ పవిత్ర సంగమం వద్ద మూడు రోజుల పాటు నిర్వహించిన ఎఫ్1హెచ్2ఓ బోటింగ్ రేస్‌లను విజయవంతం చేయడంలో కలెక్టర్ కృషిని అధికారులు ప్రస్తుతించారు. ఈ కార్యక్రమంలో జెసీ విజయకృష్ణన్, జెసీ-2 పిడుగు బాబూరావు, ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్‌ల ఇడీలు ఎన్‌వివి సత్యనారాయణ, ఈశ్వరరావు, పెంటోజీరావు, బీసీ వెల్ఫేర్ డీడీ యుగంధర్, సోషల్ వెల్ఫేర్ జెడీ పిఎస్‌ఎ ప్రసాద్, వికలాంగుల శాఖ ఎడీ నారాయణరావు, డీఎస్‌ఓ ఆనందబాబు, ఐసీడీఎస్ పీడీ కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు.
పాండురంగడిని దర్శించుకున్న కలెక్టర్, జెసీ
మచిలీపట్నం : కీరపండరీపురుడైన చిలకలపూడి పాండు రంగ స్వామి వారిని సోమవారం జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం, జాయింట్ కలెక్టర్ కె విజయకృష్ణన్‌ను దర్శించుకున్నారు. పాండు రంగడి ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజైన సోమవారం స్వామివారిని దర్శించుకున్న కలెక్టర్, జెసీలు ప్రత్యేకలు పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం పాండురంగడి ఉత్సవ ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు.. ఒక్క ఆంధ్రప్రదేశ్ నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు పాండురంగడి దర్శనానికి వచ్చే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి పర్వదినం రోజున భక్తుల తాకిడి విపరీతంగా ఉంటుందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని భక్తులకు అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ఆయన వెంట ఆర్డీవో జె ఉదయ భాస్కర్, తహశీల్దార్ కె శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.