కృష్ణ

మహిళలకు రక్షణ కవచంగా ‘ఫోక్సో’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: మహిళలకు రక్షణ కవచంగా ఫోక్సో చట్టాన్ని జిల్లాలో పటిష్ఠవంతంగా అమలు చేస్తున్నట్లు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫోక్సో చట్టంతో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలను గణనీయంగా తగ్గించగలుగుతున్నట్లు తెలిపారు. చట్టం పట్ల విస్తృత ప్రచారం కల్పిస్తున్నామన్నారు. ముఖ్యంగా విద్యా సంస్థల్లో పెద్ద ఎత్తున అవగాహన సదస్సులు నిర్వహించి ఫోక్సో చట్టం తీవ్రతను తెలియచేస్తున్నామన్నారు. దీని వల్ల యువతలో చాలా మార్పు వస్తోందన్నారు. ఆడ పిల్లల జోలికి వస్తే కఠిన శిక్షలు, మహిళలు, బాలికలపై అత్యాచారాలకు పాల్పడే దుర్మార్గులపై ఫోక్సో చట్టాన్ని అమలు చేసి వారిని కటకటాల పాలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ఎవరైనా చిన్నారులపై గానీ, మహిళలపై గానీ దాడులకు పాల్పడినట్లైతే వారికి శిక్షను కఠినతరం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చిన్నారుల రక్షణ కోసం ఈ ఫోక్సో చట్టాన్ని అమలులోకి తీసుకు వచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ చట్టం ద్వారా ఎవరైనా వ్యక్తి 18 సంవత్సరాలు నిండని వారిపై లైంగిక వేధింపులకు పాల్పడినా, వారిని మానసికంగా కృంగదీసేలా మాట్లాడినా, అత్యాచారానికి పాల్పడినా వారి ప్రమేయం లేకుండా అపహరించడానికి ప్రయత్నించినా ఈ చట్టం ప్రకారం వారు శిక్షార్హులవుతారని తెలిపారు. అంతే గాక ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా నమోదైన కేసుల్లో నిందితులకు ఈ చట్టాలను అమలుపర్చి బాధితులకు న్యాయం చేసి వారికి అండగా నిలవడంలో పోలీసులు కీలక పాత్ర పోషించినట్లు ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తెలిపారు.