కృష్ణ

నేటి నుండి రాష్ట్ర స్థాయి వాలీబాల్ టోర్నమెంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఎడ్యుకేషన్): కృష్ణా జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని పీబీ సిద్దార్థ కళాశాల మైదానంలో గురువారం నుండి నాలుగు రోజులపాటు 5వ రాష్ట్ర స్థాయి సీనియర్ వాలీబాల్ చాంపియన్‌షిప్ నిర్వహిస్తున్నట్లు అర్జున, ద్రోణాచార్య అవార్టు గ్రహీత ఎ రమణరావు తెలిపారు. బుధవారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్రంలో ఐదవ సీనియర్ అంతర జిల్లాల వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని, నెల్లూరులో జరగాల్సిన సీనియర్ టోర్నమెంట్ రద్దు కావడంతో హుటాహుటిన నగరంలో నిర్వహించేందుకు కృష్ణా జిల్లా సంఘం ముందుకు రావడం అభినందనీయమన్నారు. లీగ్ కమ్ నాకౌక్ పద్ధతిలో టోర్నమెంట్ జరుగుతుందని, ఉదయం, సాయంత్రం మ్యాచ్‌లు ఉంటాయన్నారు. సాయంత్రం ఫ్లడ్ లైట్ల వెలుగులో మ్యాచ్‌ల నిర్వహణకు ఏర్పాట్లు చేశామని, రెండు మైదానాలను సిద్ధం చేశామని పేర్కొన్నారు. అభిమానులు, ప్రేక్షకులు మ్యాచ్‌లు చూసేందుకు ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. మొత్తం మ్యాచ్‌ల నిర్వహణకు నాలుగు మైదానాలు సిద్ధం చేశామని, సుమారు 500 మంది పాల్గొంటున్నారని పేర్కొన్నారు. 13 జిల్లాల నుండి పురుషులు, మహిళల జట్లు పాల్గొంటున్నాయని, అందరికీ ఉచిత భోజన, వసతి సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలపారు. టోర్నమెంట్ నిర్వహణకు ఆంధ్ర హాస్పిటల్స్, కెఎల్ వర్సిటీ, సిద్దార్థ అకాడమీ, వాలీబాల్ సీనియర్ క్రీడాకారులు సహాయ సహాకారాలు అందిస్తున్నారని జిల్లా సంఘ అధ్యక్షుడు ఎన్ బ్రహ్మజీ తెలిపారు. గురువారం సాయంత్రం ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, ప్రజా ప్రతినిధులు పాల్గొంటారని పేర్కొన్నారు. వాలీబాల్ వెటరన్ క్రీడాకారులను సత్కరిస్తామన్నారు. విలేఖరుల సమావేశంలో జిల్లా కార్యదర్శి డి దయాకరరావు, ఎ జగన్మోహనరావు(బాబా), కె వెంకటేశ్వరరావు, జి నరసింహరావు, బి మురళీకృష్ణ, ఎ ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.