కృష్ణ

* రైల్వేస్, పంజాబ్, చత్తీస్‌గఢ్ విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఎడ్యుకేషన్): ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న బీసీసీఐ సీనియర్ మహిళల ఎలైట్ గ్రూప్-ఎ పోటీల్లో బుధవారం రైల్వేస్, పంజాబ్, చత్తీస్‌ఘడ్ జట్లు విజయం సాధించాయి. రైల్వేస్ జట్టు సభ్యురాలు వేదా కృష్ణమూర్తి 80 పరుగులు, పంజాబ్ జట్టు సభ్యురాలు జాసియా అక్తర్ 76 పరుగులు చేశారు. మూలపాడులోని ఏసీఏ క్రికెట్ కాంప్లెక్స్‌లో చత్తీస్‌ఘడ్, గోవా జట్ల జరిగిన మ్యాచ్‌లో 26 పరుగుల తేడాతో చత్తీస్‌ఘడ్ జట్టు విజయం సాధించింది. టాస్ గెలిచిన చత్తీస్‌ఘడ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన ఛత్తీస్‌ఘడ్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. జట్టులో ఎం షాలిని 33 పరుగులు చేయగా, షివి పాండే 60 పరుగులు, మన్‌ప్రీత్‌కౌర్ 49 పరుగులు చేశారు. 175 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన గోవా 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. జట్టులో సునాంద 40 పరుగులు, తేజశ్విని 28 పరుగులు చేశారు. మరో మ్యాచ్‌లో సౌరాష్ట్ర, పంజాబ్ జట్లు తలపడగా 91 పరుగుల తేడాతో పంజాబ్ విజయాన్ని నమోదు చేసింది. టాస్ గెలిచిన సౌరాష్ట్ర జట్టు పంజాబ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ జట్టు 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. జట్టులో జాసియా అక్తర్ 76 పరుగులు చేసింది. 200 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన సౌరాష్ట్ర 42.3 ఓవర్లలో 108 పరుగులకు అలౌటైంది. జట్టులో జాయుజడేజా 22 పరుగులు, రిధి 27 పరుగులు చేశారు. గుంటూరులో జరిగిన మరో మ్యాచ్‌లో రైల్వేస్, మహారాష్ట్ర జట్లు తలపడగా 52 పరుగులతో రైల్వేస్ విజయాన్ని సాధించింది. టాస్ గెలిచిన మహారాష్ట్ర జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన రైల్వేస్ జట్టు 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. జట్టులో వేదా కృష్ణమూర్తి 80 పరుగులు, అరుంధతీ రెడ్డి 48 పరుగులు, మోనమిశ్రామ్ 29 పరుగులు చేశారు. 232 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ దిగిన మహారాష్ట్ర జట్టు 50 ఓవర్లలో7 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. జట్టులో ఎస్‌ఆర్ మానే 55 పరుగులు, ఎస్‌ఎస్ షిండే 46 పరుగులు చేశారు.