కృష్ణ

దాహార్తిని తీర్చడం అభినందనీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కలిదిండి, మే 13: వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చడం అభినందనీయమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డా. కామినేని శ్రీనివాస్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్, ఏలూరు ఎంపి మాగంటి వెంకటేశ్వరరావు అన్నారు. మండల పరిధిలోని కోరుకొల్లులో శుక్రవారం కైకలూరు నియోజకవర్గ పవన్ కళ్యాణ్, జనసేన అధ్యక్షులు కేసిరెడ్డి బలరాం ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత మంచినీటి ట్యాంకర్‌ను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ సహాయం ఆశించకుండా జనసేన నాయకులు ముందుకురావటం అభినందనీయమన్నారు. అనంతరం ఇరిగేషన్ కార్యాలయంలో ఇంకుడు గుంటను ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకట రమణ, మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్, మార్కెట్ యార్డు ఛైర్మన్ నంబూరి వెంకట రామరాజు పాల్గొన్నారు.