కృష్ణ

అబ్బురపరచిన ‘మాడుగుల’ అష్టావధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కల్చరల్): స్థానిక బచ్చుపేట శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థాన కల్యాణ మండపంలో ఆదివారం నిర్వహించిన అష్టావధానం సాహితీ ప్రియులను అలరించింది. అవధాన సహస్రఫణి, అవధాత సరస్వతీ పీఠాధ్యక్షుడు డా. మాడుగుల నాగఫణి శర్మ అవధానంలో హృద్యమైన పద్యాలను వినిపించారు. నిషిద్దాక్షరి అంశాన్ని నిర్వహించిన పువ్వాడ తిక్కన సోమయాజీ లక్ష్మీ సరస్వతుల సారూప్యాన్ని వివరించమనగా చక్కటి పద్యాన్ని వినిపించారు. డా. కప్పగంతు రామకృష్ణ ‘చన్నులు లేని యావులు బ్రసన్నత పాలనొసంగె బానెడున్’ అను సమస్యను పూరించమనగా అందంగా పూరించారు. యమహ, విస్పా, టీవిఎన్, హోండా అనే పదాలను ఉపయోగిస్తు అవధాన సఠస్వతీ పీఠం గురించి పద్యం చెప్పమని దండిభొట్ల దత్తాత్రేయ శర్మ కోరగా చక్కటి పద్యాన్ని అవధాని అందించారు. నారాయణ విఖనసాచార్యులు వర్ణన అంశాన్ని, మేడూరి శేషరంగనాధ్ న్యస్తాక్షరి అంశాన్ని, దీవి ఫణికృష్ణ అశువు అంశాన్ని, వేమూరి పూర్ణచంద్రరావు ఘంటా గణననంను నిర్వహించారు. సాహితీ విమర్శకుడు డా. సశ్రీ చేసిన అప్రస్తుత ప్రసంగం శ్రోతలను నవ్వించింది. తొలుత ఆలయ స్థానాచార్యులు ముత్తేవి శ్రీనివాస శశికాంత్ సంకలనం చేసిన పండుగలు - ప్రమాణాలు అనే పుస్తకాన్ని డా. నాగ ఫణి శర్మ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ మేనేజర్ జక్కా ధర్మారాయుడు, డా. బి ధన్వంతరి ఆచార్య, సి శేషాచార్యులు (అప్పాజీ), ఆర్‌కె గోల్డ్ అధినేత జి రామబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.

సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సన్నిధిలో వీఐపీలు

మోపిదేవి, డిసెంబర్ 9: మోపిదేవిలో వేంచేసియున్న శ్రీ వల్లీదేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ఆదివారం పలువురు వీఐపీలు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. ఆదివారం సెలవు దినం కావటంతో కృష్ణా, గుంటూరు జిల్లాల నుండే కాకుండా ఇతర ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనార్ధం పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వీరితో పాటు ఆలయానికి వీఐపీల తాకిడికి కూడా ఎక్కువైంది. రాష్ట్ర వాణిజ్య పన్నుల చీఫ్ కమీషనర్ జె శ్యామలరావు, రాష్ట్ర కమ్యూనికేషన్ ఐజీ ఎన్‌ఎస్ జయలక్ష్మి, ఏపీ ట్రాన్స్‌కో జెఎండీ ముళీధర్ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. తొలుత నాగ పుట్టలో పాలు పోసి మొక్కుబడులు తీర్చుకున్నారు. అనంతరం గర్భాలయంలోని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. చల్లపల్లి ఎస్టేట్ దేవాలయాల అసిస్టెంట్ కమిషనర్ ఎం శారదా కుమారి స్వామివారిని దర్శించుకున్న వీఐపీలకు స్వామివారి జ్ఞాపిక, ప్రసాదాలు అందచేశారు. అలాగే వాణిజ్య పన్నుల చీఫ్ కమీషనర్ జె శ్యామలరావు ఆ శాఖ రాష్ట్ర అసిస్టెంట్ కమీషనర్ విజయ భాస్కర్, డెప్యూటీ అసిస్టెంట్ కమీషనర్లు డి సాంబశివరావు, ఎం శ్రీలక్ష్మి, డి రాజేష్ తదితరులు ఉన్నారు.