కృష్ణ

చింతకోళ్లలో ‘స్వైన్‌ఫ్లూ’ లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం/కోడూరు: స్వైన్ ఫ్లూ వ్యాధి పేరుతో కోడూరు మండలం చింతకోళ్ల గ్రామాన్ని పరిసర గ్రామాల ప్రజలు వెలి వేశారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని అధికారులు కొట్టి వేశారు. గ్రామంలో సాధారణ పరిస్థితులే ఉన్నాయన్నారు. ప్రజలను ఈ విధంగా భయభ్రాంతులకు గురి చేయడం తగదన్నారు. దివిసీమలో స్వైన్‌ప్లూ కలకలంతో వార్తల్లో ప్రధాన అంశంగా మారిన కోడూరు మండల పరిధిలోని చింతకోళ్ల గ్రామాన్ని బందరు ఆర్డీవో జె ఉదయ భాస్కరరావు సందర్శించారు. కలెక్టర్ బి లక్ష్మీకాంతం ఆదేశాల మేరకు గ్రామంలో నెలకొన్న పరిస్థితులపై ఆర్డీవో ఇతర శాఖల అధికారులతో కలిసి సమీక్షించారు. అధికారులతో పాటు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు కూడా గ్రామాన్ని సందర్శించి అక్కడి పరిస్థితులపై వాకబు చేశారు. కొన్ని పత్రికల్లో (ఆంధ్రభూమి కాదు) చింతకోళ్ల గ్రామంలో స్వైన్‌ప్లూ వైరస్ ఉందన్న నెపంతో ఆ గ్రామస్థులతో పక్క గ్రామాల ప్రజలు ఎవ్వరూ మాట్లాడకుండా ఆ గ్రామంలోని పశువులు నుంచి వచ్చే పాలను ఎవ్వరూ సేకరించకుండా ఆ గ్రామంలోని పిల్లలు వివిధ పాఠశాలల్లో చదువుతుండగా ఆయా యాజమాన్యాలు బడికి రావద్దని చెప్పినట్లుగా ఆదివారం ప్రచురితమైన కథనాలను గ్రామస్థులు సైతం తప్పుబట్టారు. మహాప్రభో... ఇవన్నీ పుకార్లు ఎవ్వరూ నమ్మవద్దంటూ ఆ ఊరి యువకులు గగ్గోలు పెట్టుకొవల్సిన దుస్థితి ఏర్పడింది. వలస కూలీ అయిన గ్రామానికి చెందిన ముఠామేస్ర్తీ పేరే నాంచారయ్య ఇటీవల అనారోగ్యంతో విజయవాడ టైమ్స్ ఆస్పత్రిలో మృతి చెందాడు. అయితే వలసల నిమిత్తం పలు ప్రాంతాలకు వెళ్లే నాంచారయ్య అంతుచిక్కని వ్యాధితో మృతి చెందాడని పుకార్లు వ్యాపించాయి. దీనిపై కూడా అధికారులు స్పష్టత ఇచ్చారు. నాంచారయ్య గుండె సంబంధిత వ్యాధితో మాత్రమే చనిపోయాడని జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం ప్రకటించారు. అతని కుటుంబ సభ్యులకు సైతం వైద్య పరీక్షలు నిర్వహించగా ఎటువంటి వ్యాధి లక్షణాలు అతని కుటుంబంలో లేవని పేర్కొనడం విశేషం. కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామంలో పారిశుద్ధ్య చర్యలను మెరుగుపరిచారు. బందరు డీఎల్‌పీఓ సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రత్యేక పారిశుద్ధ్య బృందాలు గ్రామంలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాయి. గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న వైద్య శిబిరాన్ని వైద్య ఆరోగ్య శాఖాధికారులు ఆదివారం కూడా కొనసాగించారు. మందపాకల పీహెచ్‌సీ వైద్యాధికారి డా. రత్నగిరిరావు నేతృత్వంలో గ్రామస్థులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి స్వైన్ ప్లూ పట్ల వారికి అవగాహన కల్పిస్తున్నారు. అలాగే గ్రామంలో దుష్పచారాన్ని నమ్మవద్దంటూ ఆటో ద్వారా మైక్ ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర వైకాపా కార్మిక విభాగం కార్యదర్శి గుడివాక శివరావు, జనసేన నాయకుడు రాయపూడి వేణుగోపాలరావు తదితరులు గ్రామంలో నెలకొన్న పరిస్థితులపై వాకబు చేశారు. గ్రామంలో నెలకొన్న ప్రధాన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు.

ప్రజారక్షణకు శ్రమిస్తున్న పోలీసు వ్యవస్థ

మచిలీపట్నం (కోనేరు సెంటరు) డిసెంబర్ 9: ప్రజల ప్రాణాలు, ఆస్తులు కాపాడటానికే చట్టప్రకారం 24గంటలు పోలీసు వ్యవస్థ పని చేస్తోందని జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు ఎండీ మస్తాన్‌ఖాన్ అన్నారు. మచిలీపట్నం టూవీలర్స్ మెకానిక్స్, వర్కర్స్ సంక్షేమ సంఘం పట్టణ సర్వసభ్య సమావేశం ఆదివారం స్థానిక అన్నం రాఘవరావు కల్యాణ మండపంలో జరిగింది. ప్రతి మెకానిక్ ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, హెల్మెట్, సీట్ బెల్ట్, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు వలన ప్రమాదాల సంఖ్య తగ్గుముఖం పట్టిందని, ప్రజలు అవగాహన పెంచుకోవాలన్నారు. మెకానిక్‌లు మారుతున్న కాలానుగుణంగా నూతన కంప్యూటర్ టెక్నాలజీ ద్వారా శిక్షణ పొందాలని సంఘ లీగల్ ఎడ్వయిజర్, ప్రముఖ న్యాయవాది లంకిశెట్టి బాలాజీ అన్నారు. సంఘ నూతన అధ్యక్షుడు కొల్లా వెంకట సుబ్బారావు మాట్లాడుతూ మచిలీపట్నంలో టూ వీలర్స్ మెకానిక్స్‌కు ఇంటి స్థలాలు, ఆటోనగర్‌లో ప్రత్యేక స్థలాలు కేటాయించాలన్నారు. త్వరలో పట్ట్భా ఆంధ్రబ్యాంక్ మెమొరియల్ ట్రస్ట్‌ద్వారా శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రముఖ సైకాలజిస్టు అనుమకొండ అనంతకుమార్ మెకానిక్‌లు తమ కస్టమర్ల పట్ల ఏ విధంగా వ్యవహరించాలో తెలియచేశారు. సీనియర్ మెకానిక్‌లు, రాష్ట్ర పోలీసు అసోసియేషన్ సంయుక్త కార్యదర్శిగా ఎన్నికైన ఎండీ మస్తాన్‌ఖాన్‌ను మెకానిక్స్ అసోసియేషన్ ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమం రాష్ట్ర ఉపాధ్యాయ సంఘ నాయకులు చండిక వేణు, సంఘ కార్యదర్శి దాసరి శివ, నాగేంద్రం తదితరులు పాల్గొన్నారు.