కృష్ణ

తంపులు పెడుతున్నారు... తస్మాత్ జాగ్రత్త!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం: పని లేని నాయకులు పసలేని విమర్శలతో జనంలో తిరుగుతున్నారని, అటువంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు హెచ్చరించారు. అధికారమే పరమావధిగా నోట్ల కట్టలతో కోట్లలో హామీలు గుప్పిస్తూ కుర్చీ ఎక్కేద్దామని చూస్తున్న వసంత కృష్ణప్రసాద్ పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆయన హితవు పలికారు. ఏం చెప్పాలో తెలియక, జనంలో తిరుగుతూ వర్గవైషమ్యాలు సృష్టిస్తున్నారని విమర్శించారు. స్థానిక విలేఖరితో ఆయన మాట్లాడుతూ ఇటువంటి వారికి ఆదిలోనే చెక్ పెట్టకపోతే మున్ముందు సోదరుల్లా మెలిగే గ్రామస్తులు కక్షలు కార్పణ్యాలతో కొట్లాడుకోవాల్సి వస్తుందని అన్నారు. వైసీపీ అధినేత జగన్ జనాన్ని ఉద్దరించడానికి ఉద్భవించిన వాడిలా ‘వాకింగ్’ చేస్తూ ప్రాంతాలవారీగా చిచ్చు పెడుతున్నారని, అయితే ఆయనను అభినవ ‘ఆషాడభూతి’లా భావిస్తున్నారని అన్నారు. ఆ ‘మహానేత’ బాటలో ఈ ‘పిల్ల నాయకుడు’ గ్రామా ల్లో తంపులు పెట్టి తమాషా చూస్తున్నాడని విమర్శించారు. ఎప్పుడూ జనం మధ్య లేకుండా వ్యాపారాలకే పరిమితమై అక్రమ మార్గంలో సంపాదించిన డబ్బు మదంతో ఎమ్మెల్యే అయిపోదామని వచ్చాడని దుయ్యబట్టారు. ఏడాదికోమారు కూడా స్వస్థలానికి రాని కేపీ అధికారం చేజిక్కించుకోడానికి ఇవ్వని హామీ అంటూ లేదని అన్నారు. ఇప్పుడే వారానికి ఐదు రోజులకే పరిమితమై కేపీ ఎన్నికల తరువాత ‘అడ్రస్’ గల్లంతు కావడం ఖాయమని, మళ్లీ హైదరాబాద్‌కే పోతాడని స్పష్టం చేశారు. కోర్టు గుమ్మం చూడనిదే ఆయనకు, ఆ ముఠా నాయకుడికి పొద్దు గడవదని అన్నారు. ‘దొంగే దొంగ.. దొంగ’ చందంగా నీతులు వల్లిస్తున్నాడని విమర్శించారు. ఇటువంటి వారి పట్ల విజ్ఞత కలిగిన మైలవరం ఓటర్లు అప్రమత్తతో వ్యవహరించి గ్రామాల్లో నుండి తరిమికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.