కృష్ణ

అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కల్చరల్): వెట్టి చాకిరిని రూపుమాపడానికి అమెరికా పూర్వ అధ్యక్షుడు అబ్రహంలింకన్ చేసిన కృషి చిరస్మరణీయమని హిందూ కళాశాల పూర్వ చరిత్ర శాఖాధిపతి ఎస్ వెంకటేశ్వరరావు అన్నారు. స్థానిక బ్రహ్మ సమాజ ప్రార్థనా మందిరంలో సోమవారం వైజ్‌మెన్ క్లబ్, బ్రహ్మ సమాజం సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జస్టిస్ పున్నయ్య మానవ హక్కులను పరిరక్షించే విధంగా తీర్పులు వెలువరించడంలో విశేష కృషి చేశారన్నారు. ప్రాణ రక్షణ హక్కు, ఎదుటి వారినొప్పించకుండా వాక్ స్వాతంత్య్రపు హక్కును కాపాడుకోవాలన్నారు. మానవ హక్కులకు భంగం వాటిల్లితే రాష్ట్ర కౌన్సిల్ జాతీయ స్థాయిలో జాతీయ మా నవ హక్కు కౌ న్సిల్ ద్వారా న్యాయం పొందవచ్చన్నారు. లింగం ఫి లిప్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డా. ఉడత్తు శ్రీనివాసరావు, ముక్తేవి శ్రీనివాస చంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు.
చదరంగం జిల్లా విజేత ‘తేజస్విని’కి డీఇఓ అభినందనలు
మచిలీపట్నం (కల్చరల్), డిసెంబర్ 10: 82వ గ్రిగమెమోరియల్ జిల్లా స్థాయి చదరంగం పోటీల్లో జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన భాష్యం పబ్లిక్ స్కూల్ 7వ తరగతి విద్యార్థిని జంపాన లక్ష్మీ తేజస్వినిని జిల్లా విద్యా శాఖాధికారిణి ఎంవి రాజ్యలక్ష్మి అభినందించారు. సోమవారం సదరు విద్యార్థిని డీఇఓ రాజ్యలక్ష్మిని కలవగా ఆమె అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు విద్యార్థులకు ప్రోత్సాహం ఇస్తే వారు ఏ రంగంలోనైనా రాణిస్తారన్నారు. ఈ నెల 4వతేదీన అవనిగడ్డలో జరిగిన బందరు డివిజన్ స్థాయి చదరంగం పోటీల్లో, తిరువూరు జెడ్పీ గరల్స్ హైస్కూల్‌లో జరిగిన జిల్లా స్థాయి చదరంగం పోటీల్లో లక్ష్మీ తేజస్విని ప్రథమ స్థానంలో నిలవడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాండ్రాక వెంకటేశ్వరరావు, సిహెచ్ పవన్ కుమార్, పూజ అకాడమి చదరంగం కోచ్ నంబూరి శ్రీ్ధర్, భాష్యం స్కూల్ ప్రిన్సిపాల్ ఎం చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.