కృష్ణ

జాతీయ స్థాయి పోటీలకు జుజ్జవరం విద్యార్థిని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి: మొవ్వ మండలం భట్లపెనుమర్రు జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన జుజ్జువరపు పరిమళ జాతీయ స్థాయి రబ్బీ పోటీలకు ఎంపికైంది. ఈనెల 25 నుండి 30వ తేదీ వరకు ఒరిస్సా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌లో నిర్వహించే జాతీయ స్థాయి రబ్బీ పోటీలకు అండర్-14 బాలికల విభాగంలో రాష్ట్ర జట్టుకు పరిమళ ఎంపికైనట్లు హెచ్‌ఎం రామిశెట్టి విజయశ్రీ తెలిపారు. సోమవారం హెచ్‌ఎం విలేఖర్లతో మాట్లాడుతూ ఈనెల 3, 4, 5 తేదీల్లో వైఎస్‌ఆర్ కడప జిల్లాలో జరిగిన అంతర్ రాష్ట్ర రబ్బీ పోటీల్లో ఈ పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థినులు సంధ్యా, పూజిత, శశి, సోని, పరిమళ పాల్గొన్నారు. అయితే పరిమళ ఈ పోటీల్లో కనబర్చిన ప్రతిభను గుర్తించిన ఎంపిక బృందం రాష్ట్ర స్థాయి జట్టుకు ఎంపిక చేసింది. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఇవి రామారావు, ఎన్ సుబ్రహ్మణ్యం, పీఇటీ బి రాము పాల్గొన్నారు. ఆ గ్రామ మాజీ సర్పంచ్‌లు కొడాలి దయాకర్, గొట్టిపాటి వెంకట్రావ్, సీబీఆర్ అకాడమీ డైరెక్టర్ చలసాని బాబూరాజేంద్రప్రసాద్ తదితరులు అభినందించారు.
డోకిపర్రు వెంకన్నకు కలశాభిషేకాలు
గుడ్లవల్లేరు, డిసెంబర్ 10: మండల పరిధిలోని డోకిపర్రు గ్రామంలో వేంచేసియున్న శ్రీ, భూ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం కన్నుల పండువగా 1008 కలశాలతో అభిషేకములు నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపకుడు, ధర్మకర్త పురిటిపాటి వెంకట కృష్ణారెడ్డి సతీమణి సుధారెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వేకువ జామునే స్వామివారికి వివిధ ప్రత్యేక పూజలు, అభిషేకములు నిర్వహించారు. పురిటిపాటి వీరారెడ్డి, వియలక్ష్మి దంపతులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా భోగ శ్రీనివాసమూర్తికి పాలు, పెరుగు, తేనే సుగంధ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం చేశారు. అనంతరం సర్వ భూపాల వాహనంపై శ్రీనివాసుడి గ్రామోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వందలాదిగా భక్తులు పాల్గొన్నారు.