కృష్ణ

సంక్రాంతి తర్వాత కొత్త బిచ్చగాళ్లు కనబడరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం: పదవి, అధికారం కోసం కొత్తబిచ్చగాళ్ళు గ్రామాలలో డబ్బు సంచులతో వస్తున్నారని సంక్రాంతి తర్వాత ఆ కొత్త బిచ్చగాళ్ళు కనబడరని రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వైసీపీ నేత వసంత వెంకట కృష్ణ ప్రసాద్‌ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. సోమవారం మండలంలోని గణపవరం గ్రామంలో గ్రామదర్శిని, గ్రామవికాసం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన గ్రామంలో ప్రజలనుండి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామ కూడళ్ళలో ఆయన ప్రసంగిస్తూ సంక్రాంతి తర్వాత గ్రామంలో కొత్త బిచ్చగాళ్ళు కనిపించరని అధికారం, పదవీ వ్యామోహంతో అక్రమంగా సంపాదించిన డబ్బు సంచులతో గ్రామాల్లోకి వచ్చి కులాలను, మతాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకునేందుకు తహతహలాడుతున్నారని ఆరోపించారు. జలవనరుల శాఖా మంత్రిగా పట్టిసీమ, చింతలపూడి, పోలవరం కట్టినా మైలవరం నియోజకవర్గ ప్రజల ఆశీస్సులేనని స్పష్టం చేశారు. జూన్, జూలై మాసాలలో చింతలపూడి ద్వారా గోదావరి జలాలను ఈప్రాంతానికి రప్పించి చరిత్ర సృష్టించబోతున్నట్లు తెలిపారు. ఈనెల 17న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుచే పోలవరం తొలి గేటుకు ప్రారంభోత్సవం చేయించనున్నట్లు వెల్లడించారు. పోలవరానికి మొత్తం 48 గేట్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని ప్రగతి పధంలో నడిపేందుకు అహర్నిశలూ కష్టపడుతున్నారని ఆయన కష్టాన్ని గుర్తించి అందరూ ఆయనకు సహకరించాలన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా వేల కోట్ల రూపాయలను వెచ్చించి రాష్ట్రాన్ని అభివృద్ధిపధంలోకి తీసుకెళ్తున్నట్లు తెలిపారు. మేధావులు వౌనంగా ఉండొద్దని, తెలుగు నేలపై జరుగుతున్న రాజకీయ పరిణామాలను, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకెళ్ళాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌కు సీఎం పదవి పిచ్చి పట్టుకుందని, ప్రజాసమస్యలపై ధ్యాస లేదని ఎద్దేవా చేశారు. సమర్థవంతమైన నాయకత్వం లేనప్పుడు ఏ రాష్టమ్రైనా అభివృద్ధిలో వెనుకబడిపోతుందన్నారు. మైలవరం నియోజకవర్గంలో గ్రామ గ్రామాన జరుగుతున్న అభివృద్ధిని వీక్షించి ప్రగతి కార్యక్రమాలపై సూచనలు, సలహాలను అందించాలన్నారు. గణపవరం గ్రామానికి 98 లక్షల రూపాయలతో ఇంటింటి కుళాయిని మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈసందర్భంగా ఆదరణ పధకం కింద అత్యాధునిక పనిముట్లను లబ్ధిదారులకు అందించారు. ఈకార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.