కృష్ణ

కూటమి ఓటమికి చంద్రబాబే కారణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగ్గయ్యపేట: తెలంగాణాలో మహాకూటమి ఓటమికి ప్రధాన కారణంగా ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబే కారణమని వైకాపా విజయవాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను అన్నారు. మంగళవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గత ఎన్నికల్లో కంటే తక్కువ స్థానాలు లభించాయని, దానికి చంద్రబాబు నైతిక బాధ్యత వహించాలన్నారు. కాంగ్రెస్‌తో టీడీపీ జత కట్టడం అనైతిక చర్య అని, దీనిని ప్రజలు అసంహించుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టిన తెలుగుదేశం విజ్ఞత కలిగిన ఏ ఓటరూ జీర్ణించుకోలేకపోయాడని స్పష్టం చేశారు. కబుర్లకు ఓటర్లు బుట్టలో పడే రోజులు పోయాయని, ఎవరేంటో ప్రజలకు బాగా అర్థం అవుతోందని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌తో తెలుగుదేశం జతకట్టడంతో టిఆర్‌ఎస్‌కు ప్రజల్లో ఉన్న వ్యతిరేకత పోయందన్నారు. కారు అంత స్పీడుగా దూసుకుపోవడానికి పరోక్షంగా తెలుగుదేశం దోహదడినట్టయందని అన్నారు. టీఆర్‌ఎస్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత వచ్చినా చంద్రబాబు కాంగ్రెస్‌తో కలవడంతో ప్రజలు హర్షించలేదని అన్నారు. రాష్ట్రంలో మహా కూటమికి పట్టిన గతే ఇక్కడ చంద్రబాబుకు పడుతుందని సామినేని జోస్యం చెప్పారు. కూకట్‌పల్లిలో నందమూరి సుహాసిని గెలవదని తెలిసి ఆమెకు టికెట్ ఇచ్చి నందమూరి కుటుంబం ప్రతిష్ఠను చంద్రబాబు దిగజార్చారన్నారు. టిఆర్‌ఎస్ ప్రభంజనాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా సామినేని ఇంటి నుండి వైకాపా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బాణాసంచా కాల్చి హర్షం వ్యక్తం చేశారు. మిఠాయలు పంచుకుని ఒకరిని ఒకరు అభినందించుకున్నారు. విలేఖరుల సమావేశంలో మున్సిపల్ చైర్మన్ ఇంటూరి చిన్నా, నేతలు తన్నీరు నాగేశ్వరరావు, కలవకుంట్ల సాయిబాబా, తుమ్మేపల్లి నరేంద్ర తదితర నేతలు పాల్గొన్నారు.