కృష్ణ

వైభవంగా షష్టి కల్యాణోత్సవాలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోపిదేవి: మోపిదేవి శ్రీ వల్లీదేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్టి కల్యాణ మహోత్సవాలు బుధవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. స్వామి వారిని పెండ్లి కుమారుని చేసి ప్రత్యేక పూజలు, పంచామృతాభిషేకాలు నిర్వహించారు. చల్లపల్లి ఎస్టేట్ దేవాలయాల అసిస్టెంట్ కమిషనర్ ఎం శారదా కుమారి మేళతాళాలు, మంగళ వాయిద్యాలతో దేవాదాయ శాఖ తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

ప్రజా సంక్షేమానికే అధిక ప్రాధాన్యత
జి.కొండూరు, డిసెంబర్ 12: రాష్ట్రం ఆర్ధికలోటులో ఉన్నప్పటికీ, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం సహకరించ పోయినా సంక్షేమ పథకాల అమలుకు ప్రాధాన్యతనిచ్చామని రాష్ట్ర మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. గడ్డమణుగులో బుధవారం జరిగిన గ్రామదర్శిని, గ్రామవికాసం కార్యక్రమంలో పాల్గొన్న ఆయనకు టిడిపి నాయకులు గొల్లపూడి నళినీమోహన్ తదితరులు ఘనస్వాగతం పలికారు. ఈసందర్భంగా మంత్రి ఉమ మాట్లాడుతూ ఇటీవల రాష్ట్రాల్లోని ఫలితాలను బట్టి కేంద్రంలో బిజెపి ఓటమి తప్పదన్నారు. చంద్రన్న బీమా పథకం కింద ఇప్పటి వరకూ రాష్ట్రంలో రూ.2,400కోట్లు చెల్లించామన్నారు. ఇదొక చరిత్రాత్మక పథకమన్నారు. గ్రామాల్లో ఎల్‌ఇడి దీపాలు కాంతులు వెదజల్లుతున్నాయని, సిమెంటు రహదారులను నూరుశాతం నిర్మిస్తున్నామన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే అసలైన అభివృద్ధి సాధ్యమన్నారు. ప్రజలకు ఎటువంటి సమస్యలు రాకుండా నాయకులు చొరవ తీసుకోవాలన్నారు. తెలుగుదేశం మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమన్నారు. అందరూ సంతోషంగా ఉండటమే సిఎం చంద్రబాబు లక్ష్యమన్నారు. అందుకే ఆయన రోజుకు 18 గంటలకు పైగా కష్టపడుతున్నారన్నారు. కృష్ణాగోదావరి నదుల అనుసంధానంతో చరిత్ర తిరగరాశామన్నారు. వేల కోట్ల పంటలను కాపాడమన్నారు. డబ్బు సంచులతో వరసలు కలుపుకుంటూ తిరుగుతున్న వాళ్ళకు తగిన బుద్ధి చెప్పాలన్నారు. తనను ఎమ్మెల్యే చేసి, ఆపై మంత్రిని కూడా చేసి రాష్ట్ర ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగించిన మైలవరం నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. మైలవరం ఎఎంసి చైర్మన్ వుయ్యూరు వెంకట నరసింహారావు, గొల్లపూడి నళినిమోహన్, నూతక్కి రాజారావు, గుజ్జర్లపూడి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.