కృష్ణ

తలసరి ఆదాయంలో మనమే నెం.1

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ): తలసరి ఆదాయంలో జిల్లా దేశంలోనే రెండు, రాష్ట్రంలోనే మొదటి జిల్లాగా కృష్ణా జిల్లా ఘనత సాధించిందని కలెక్టర్ బీ లక్ష్మీకాంతం తెలిపారు. తలసరి ఆదాయంలో 1 లక్షా 89 వేల 121 రూపాయలతో హర్యానా రాష్ట్రం తరువాత రెండో అధిక తలసరి ఆదాయం గల జిల్లాగా కృష్ణా రికార్డు సాధించిందన్నారు. లక్షా 96 వేల 982 రూపాయల తలసరి ఆదాయంతో హర్యానా రాష్ట్రం తొలి స్థానంలో ఉందని, ఆలిండియా స్థాయిలో లక్షా 12 వేల 764 రూపాయలు తలసరి ఆదాయం నమోదు అయ్యిందన్నారు. స్థూల జిల్లా ఉత్పత్తి (జీడీపీ)లో 97 వేల 59 కోట్ల రూపాయలతో కృష్ణా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. మనరాష్ట్ర స్థూల ఉత్పత్తి 8 లక్షల 3 వేల 873 కోట్ల రూపాయలుగా నమోదైందని కలెక్టరు లక్ష్మీకాంతం తెలిపారు. రియల్ టైమ్ అవుట్ కమ్ మెనటరింగ్ సిస్టమ్ సూచికల నమోదులో 89 అంశాలలో 73 అంశాలు ఏ గ్రేడుగా నమోదు అయ్యిందన్నారు. రిజయల టైమ్ మోనటరింగ్ సిస్టమ్ సూచికల నమోదులో రాష్ట్రంలోనే కృష్ణా 73 అంశాలలో ఏ గ్రేడుతో మొదటి స్థానంలో ఉందన్నారు. ముఖ్యంగా స్ర్తి శిశు సంక్షేమంలో అమలు జరుగుతున్న కిశోరబాలికలకు పౌష్టికాహారం సబల కార్యక్రమం, బరువు తక్కువు ఉన్న ఎదుగుదల లేని ఆరేళ్ల వయస్సు లోపు చిన్నారులకు పౌష్టికాహారం అందించి నిలకడ అయిన బరువు, ఎదుగుదల సాధించడం జరిగిందన్నారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ విభాగంలోవ్యర్థ పదార్థాల నుండి సంపద తయారీ కేంద్రాల నిర్వాహణ ముఖ్యంగా వర్మీ కంపోష్ణు ఉత్పత్తి, పంట సంజీవనిలో భాగంగా పంటుంటల నిర్మాణం, శివారు గ్రామాలకు మంచినీరు సౌకర్యం కల్పించడం, ఎన్టీఆర్ భరోసా పథకంలో సామాజిక భద్రతా పెన్షన్లు అందించడం జరిగిందన్నారు. బీసీ సంక్షేమంలో వెనుకబడిన తరగతులకు చెందిన వారికి జీవనోపాధి కల్పించడం, కాపు కార్పొరేషన్ ద్వారా సంబంధిత వర్గాలకు లబ్ధి చేకూర్చడం జరిగిందన్నారు. ఉద్యాన, పట్టుపరిశ్రమలో పండ్లతోటలు, కూరగాయాల సాగుకు అదనపు భూములలో పండించడం, బిందు, తుంపర సేద్యంలో అధిక భూమికి సాగులోకి తీసుకురావడం జరిగిందన్నారు. వ్యవసాయరంగంలో ప్రకృతి వ్యవసాయాన్ని చేసే రైతుల సంఖ్యను పెంచి వారిని ప్రోత్సహించడం, రైతులకు భూసార పరీక్షా కార్డులు అందించడం, ఖరీఫ్ రబీలో అధికభూమిలో సూక్ష్మపోషకాలు వినియోగం జరిగిందన్నారు. విద్యారంగంలో పాఠశాలలకు విద్యుత్తు, వౌలిక సదుపాయలు, మంచినీరు కల్పించడం, మధ్యాహ్న భోజన పథకం అమలు, పాఠశాలలకు ఫైబర్ కనెక్టవిటీ కల్పించడం జరిగిందన్నారు. పట్టణాభివృద్ధి, పట్టణ పరిపాలన విభాగంలో అన్నీ పట్టణాలు, మున్సిపాల్టీలో పక్కారోడ్లు నిర్మించి పూర్తి చేయడం, ప్రతీ కుటుంబానికి నెలకు కనీసం రూ.10వేల ఆదాయాన్ని సమకూర్చడం జరిగిందన్నారు. ఉపాధికల్పన, కార్మిక సంక్షేమం విభాగంలో చంద్రన్న భీమా పథకంలో లబ్ధిదారుల నమోదు అర్హులకు తక్షణ చెల్లింపులు జరుపుతున్నామన్నారు. పశుసంవర్థక, మత్యశాఖ విభాగంలో పాలు, గుడ్లు, మాంసం, చేపలు, రొయ్యల ఉత్పత్తులను పెంచడం జరుగుతుందన్నారు. వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ విభాగంలో ఐదేళ్లలోపు చిన్నారులకు సకాలంలో వ్యాధినిరోధక టీకాలు వేయడం, తల్లి-బిడ్డ ఎక్స్‌ప్రెస్ సుదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవడం, ఆసుపత్రిలోనే ఎక్కువ ప్రసవాలు జరుగుతున్నాయన్నారు. మైనారిటీ సంక్షేమంలో ఎక్కువ మంది మైనారిటీ లబ్ధిదారులకు దుల్హన్ మ్యారేజ్ స్కీమ్ ద్వారా లబ్ధి చేకూర్చడం వంటి సూచికలలో ఏ గ్రేడుతో కృష్ణా ప్రథమంగా నిలిచిందని కలెక్టర్ లక్ష్మీకాంతం తెలిపారు. గృహనిర్మాణ సంస్థ విభాగంలో 2016-17 ఆర్థిక సంవత్సరంలో మంజూరైన ఎన్టీఆర్ అర్బన్ హోసింగ్ పూర్తి చేయడం జరిగిందన్నారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ పూర్తి చేయడం జరుగుతుందన్నారు. వృత్తినైపుణ్య శిక్షణ విభాగంలో నిరుద్యోగులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ మరియు ఉపాధి కల్పించడం జరిగిందన్నారు. సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమ విభాగంలో షెడ్యూలు కులాలు, తెగలకు చెందిన గృహవినియోగదారులకు 100 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్తు కల్పిండం జరిగిందన్నారు. బీ గ్రేడులో రెండు, సీ గ్రేడులో ఏడు, డీ గ్రేడులో ఏడు అంశాలు నమోదు కాబడ్డాయని వీటిని ఏగ్రేడులో సాధించేందుకు కృషి చేస్తున్నామన్నారు.