కృష్ణ

రెస్క్యూ టీమ్‌లను సిద్ధం చేశాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: ఫెథాయ్ తుఫాన్ ప్రభావంతో తీర గ్రామాల్లో నెలకొన్న పరిస్థితులను పరిశీలిస్తూ అవసరం మేర సేవలు అందించేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తెలిపారు. ఆదివారం తీర ప్రాంత గ్రామాలైన హంసలదీవి, పాలకాయతిప్ప, కృత్తివెన్ను, మంగినపూడి గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను సందర్శించి వారికి అందుతున్న వసతులను అడిగి తెలుసుకున్నారు. అలాగే అధికారులు చేపట్టిన ముందస్తు సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. అధికారులకు చేదోడు వాదోడుగా పోలీసులు కూడా సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆదేశించారు. పోలీసు శాఖ నుండి 601 మంది సిబ్బంది సహాయక చర్యల్లో పాలు పంచుకునేందుకు సిద్దంగా ఉన్నారన్నారు. 40 మందితో రెండు ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు, 78 మందితో ఆరు రెస్క్యూ స్విమ్మింగ్ పార్టీలను సిద్ధంగా ఉంచామన్నారు. కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినకుండా ఉండేందుకు ప్రభావిత మండలాల్లో నిరంతర సమాచారం కొరకు 20 స్టాటిక్ టవర్లు, 300 మ్యాన్ ప్యాక్‌లు, రెండు రిపీటర్లను ఏర్పాటు చేశామన్నారు. 53 వాహనాలతో పబ్లిక్ అడ్రెసింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసి తీర ప్రాంత గ్రామస్థులను అప్రమత్తం చేస్తున్నట్లు వివరించారు. స్థానికంగా ఉన్న మత్స్యకారుల్లో 50 మందిని గజ ఈతగాల్లను గుర్తించామన్నారు. 38 లైఫ్ జాకెట్లు, 350 రెయిన్ కోట్లు, చీకటి ప్రాంతాలను కాంతివంతం చేయడానికి నాలుగు ఆస్కా లైట్లు, 60 డ్రాగన్‌లైట్లు, 35 రోప్‌లు, 42 మెగాఫోన్‌లతో ఎటువంటి సమస్య వచ్చినా ఎదుర్కొనేందుకు పోలీసు శాఖ సంసిద్ధంగా ఉందని జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తెలిపారు. ఆయన వెంట అడిషనల్ ఎస్పీ సోమంచి సాయికృష్ణ, బందరు, అవనిగడ్డ డీఎస్పీలు యండి మొహబూబ్ బాషా, పోతురాజు తదితరులు ఉన్నారు.

అప్రమత్తంగా ఉండండి

*అధికారులకు మంత్రి రవీంద్ర ఆదేశం

మచిలీపట్నం, డిసెంబర్ 16: ఫెథాయ్ తుఫాన్ తీరం దాటే వరకు ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర న్యాయ, క్రీడ, యువజన సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అధికార యంత్రాంగానికి సూచించారు. తీర ప్రాంత గ్రామాల్లో నెలకొన్న పరిస్థితులపై ఆదివారం ఆయన కలెక్టరేట్‌లో మత్స్య శాఖ కమిషనర్ రాంశంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతంతో కలిసి సమీక్షించారు. తొలుత కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను సందర్శించిన మంత్రి రవీంద్ర అధికారులు తీసుకున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంగినపూడి బీచ్‌కు వెళ్లి అక్కడి పరిస్థితులపై అరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ తుఫాన్ తీవ్ర జిల్లాపై తక్కువగా ఉన్నప్పటికీ అధికారులంతా అప్రమత్తంగా ఆస్తి నష్టాన్ని నివారించాలని సూచించారు. పనల మీద, కుప్పల మీద ఉన్న పంటను కాపాడేందుకు రైతులకు అవసరం మేర టార్ఫాలిన్‌లను అందించాలన్నారు. ధాన్యం కొనుగోళ్లను నిరంతరం పర్యవేక్షిస్తూ కొనుగోలు చేయాలన్నారు. మంత్రి రవీంద్ర వెంట జెసీ కె విజయకృష్ణన్, ఆర్డీవో జె ఉదయ భాష్కరరావు, మత్స్య శాఖ జెడీ యాకూబ్ బాషా, సోషల్ వెల్ఫేర్ జెడీ ప్రసాదరావు, సీడీపీఓ దీప్తి, తహశీల్దార్ కె శ్రీనివాస్, ఎంపీడీవో సూర్యనారాయణ తదితరులు ఉన్నారు.