కృష్ణ

బాధ్యతలు విస్మరిస్తే సస్పెన్షనే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: ఫెథాయ్ తుఫాన్ నేపథ్యంలో తీర గ్రామాల్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్న అధికారులంతా ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం ఆదేశించారు. బాధ్యతలను విస్మరించే వారిపై సస్పెన్షన్ వేటు వేస్తానని హెచ్చరించారు. ఏ స్థాయి అధికారైనా చర్యలు కఠినంగా ఉంటాయన్నారు. తుఫాన్ ముందస్తు రక్షణ చర్యలపై ఆదివారం సాయంత్రం ఆయన తీర ప్రాంత గ్రామాల్లో విధులు నిర్వహిస్తున్న అన్ని శాఖల అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ హెచ్చరికలను పరిగణలోకి తీసుకుని ఆ దిశగా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు ముందస్తు రక్షణ చర్యలను పున పరిశీలించుకోవాలన్నారు. విశాఖ-కాకినాడ మధ్య తుపాన్ తీరం దాటే అవకాశం ఉందన్నారు. దీని కారణంగా జిల్లాలో కొద్దిపాటి ఈదురు గాలులతో ఓ మోస్తరు వర్షాలు కురిసే ప్రమాదం ఉందన్నారు. రక్షిత మంచినీటి పథకాలన్నింటిల్లో 15 రోజులకు సరిపడా నీటి నిల్వలు చేసుకోవాలన్నారు. కృత్తివెన్ను, బందరు, నాగాయలంక, కోడూరు మండలాల్లో 181 గ్రామాలను తుపాన్ ప్రభావిత గ్రామాలుగా గుర్తించినట్లు తెలిపారు. ఆయా గ్రామాల్లో 290 ఆయిల్ ఇంజన్లు, 170 జనరేటర్లను సిద్ధం చేశామన్నారు. అవన్నీ పని చేస్తున్నాయో లేవో సరి చూసుకోవాలన్నారు. అలాగే విద్యుత్ స్తంభాలు నేలకొరిగిన పక్షంలో వాటి స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేసేందుకు 3వేల విద్యుత్ స్థంభాలను అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు తెలిపారు. పశువుల కొరకు కూడా ప్రత్యేక షెల్టర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కరకట్టలు బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో అవసరం మేర ఇసుక బస్తాలను సిద్ధం చేసుకోవాలన్నారు. కరకట్టల పటిష్ఠతను ఎప్పటికప్పుడు సరి చూసుకోవాలన్నారు. ప్రత్యేక అధికారులు శాస్ర్తియ ధృక్పధంతో ప్రతి అంశాన్ని పరిశీలించి విపత్తు సమయంలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నాలుగు సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా 282 టవర్స్ ద్వారా అందే ఫోన్ సర్వీసెస్‌కు ఎటువంటి ఆటంకం లేకుండా డీజిల్, విద్యుత్ జనరేటర్లను ఏర్పాటు చేయాలన్నారు. ఇందు కోసం నూజివీడు సబ్ కలెక్టర్ స్వప్నిల్ దినకర్‌ను ప్రత్యేక అధికారిగా నియమించడం జరిగిందని కలెక్టర్ లక్ష్మీకాంతం తెలిపారు.