కృష్ణ

పరుగులెత్తించిన పెథాయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: గత మూడు రోజులుగా పరుగులెత్తించిన ‘ఫెథాయ్’ ము ప్పు జిల్లాకు తప్పింది. తొలుత మచిలీపట్నం వద్ద తీరం దాటే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో తీర ప్రా ంతాల్లో అలజడి వాతావరణం నెలకొంది. పెను తుఫాన్‌గా మారిన ఫెథాయ్ సోమవారం మ ధ్యాహ్నం 12గంటల సమయంలో కాకినాడ - యానం మధ్య కాట్రేనికోన వద్ద తీరం దా టింది. దీంతో జిల్లాకు తుఫాన్ ముప్పు పూర్తిగా తప్పినటైంది. కానీ తుఫాన్ ప్రభావంతో సముద్రంలో ఉవ్వెత్తున అలలు విరుచుకు పడ్డాయి. మంగినపూడి, పాలకాయతిప్ప బీచ్‌ల వద్ద అలల ఉధృతి తీవ్రంగా కనిపించింది. ఆది, సోమవారాల్లో మోస్తరు నుండి భారీ వర్షం కురిసింది. ఆదివారం ఉదయం 8గంటల నుండి సోమవారం మధ్యాహ్నం 3గంటల వరకు 63.9 మి.మిల సరాసరి వర్షపాతం జిల్లాలో నమోదైంది. అత్యధికంగా మండవల్లి మండలంలో 113.మి.మిల వర్షపాతం నమోదైంది. అత్యల్ప ంగా చందర్లపాడు మండలంలో 12.2 మి.మి లు నమోదైంది. తుఫాన్ ప్రభావిత మండలాలైన మచిలీపట్నంలో 57.8, కృత్తివెన్నులో 41.9, నాగాయలంకలో 64.6, కోడూరు లో 29.9మి.మిలు చొప్పున వర్షపాతం నమోదైంది. మోస్తరు వర్షాలతో పాటు తీర గ్రామాల్లో 60 నుండి 70 కిలో మీటర్ల మేర ఈదురు గాలులు వీచాయి. చలి తీవ్రత అధికంగా ఉండటంతో వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. తుఫాన్ ప్రభావిత మండలాల్లో 38 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి 4వేల 247 మందికి ఆశ్రయం కల్పించారు. బాధితులందరికీ ఉదయం టీ, టిఫిన్‌తో పాటు మధ్యాహ్నం, రాత్రికి భోజన వసతి కల్పించారు. 14 మండలాల్లో 8వేల 231 హెక్టర్లలో పంట నిడివి, పనల మీద ఉన్న పంట నీట మునిగినట్టు వ్యవసాయ శాఖాధికారులు ప్రాథమిక నివేదిక తయారు చేశారు. పంట పొలాల్లో నిలిచిన వర్షపు నీటిని ఆయిల్ ఇంజన్ల ద్వారా తొలగింపుకు చర్యలు చేపట్టారు. అలాగే పంట నష్టం అంచనాల్లో కూడా ఆ శాఖాధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గ్రామాల్లో పర్యటిస్తున్నారు. మండల ప్రత్యేక అధికారులు పారిశుద్ధ్య సహాయక చర్యలు చేపట్టారు. గ్రామాల్లో నిలిచిన వర్షపు నీటిని తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే డ్రైన్‌లలో నీటి ప్రవాహం సమృద్ధిగా ఉండేలా చర్యలు చేపడుతున్నారు. తుఫాన్ ప్రభావంతో ఎగువ ప్రాంతమైన తెలంగాణ నుండి 10వేల క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజీకి వచ్చే అవకాశం ఉందని అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీలో ఉన్న 12 అడుగుల నీటి నిల్వలను బ్యాలెన్స్ చేసేందుకు గాను 5 నుండి 7వేల క్యూ సెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నట్లు జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం తెలిపారు. ఈ కారణంగా నదీ పరివాహక ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కోరారు. ముఖ్యంగా విజయవాడ, పెనమలూరు, పమిడిముక్కల, ఉయ్యూరు మండల తహశీల్దార్లు నదీ పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను మరో రెండు రోజుల పాటు కొనసాగించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. రెండు రోజుల్లో గ్రామాల్లో సాధారణ పరిస్థితులు తీసుకు రావాలని అధికారులకు కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్‌లో ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం కూడా చలి తీవ్రత ఉండే అవకాశం ఉన్న దృష్ట్యా జిల్లాలోని అన్ని అంగన్‌వాడీలు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు శెలవు ప్రకటించారు. ఎవరైనా పాఠశాలలు తెరిచినట్లు తెలిస్తే సంబంధిత పాఠశాలల గుర్తింపును రద్దు చేస్తామని జిల్లా విద్యా శాఖాధికారిణి ఎంవి రాజ్యలక్ష్మి హెచ్చరించారు.