కృష్ణ

పెథాయ్ ప్రభావంతో జోరు వాన...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోట్లవల్లూరు: బంగాళాఖాతంలో ఏర్పడిన పెథాయ్ ప్రభావంతో తోట్లవల్లూరు మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. ఈ భారీ వర్షంతో మండలంలోని వల్లూరుపాలెం, బొడ్డపాడు, యాకమూరు తదితర గ్రామాల్లో కోతలు కోసి ఉన్న వరిపనలు నీటిలో మునిగి పోయాయి. వరి పనలు నీటిలో నానుతుంటే రైతు వారి గుండె తరుకుపోయింది. కష్టపడి ఆరుగాలం శ్రమించి పంట పండించిన నోటికొచ్చే సమయంలో తుఫాన్ దాటికి నష్టపోవలసి వచ్చిందని రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. చేసిలేక ఓ రైతు నీటిలో నానుతున్న వరి పనలు చూపించి తుఫాన్ ప్రభావంతో నష్టపోయానని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాడు. కొంత మంది రైతులు చేసేది లేక ఆ వర్షంలో పొలంలో నీరు పోయేందుకు దారులు తీశారు. కొన్ని పొలాల్లో కుప్పలు కూడా నీటిలో నానుతు కనిపించాయి. ఏది ఏమైనా పెథాయ్ తుఫాన్ ప్రభావంతో వరి, మినుము పంటలు రైతులు బాగా నష్టపోయారు. మండలంలో సుమారు 8 వేల ఎకరాల్లో వరి పైరు వేయగా సుమారు 80శాతం వరి కుప్పలు, యంత్రాలతో కోశారు. మిగిలిన 20శాతం రైతులు వరి కోతలు కోసి ఉండగా వరి పనలు నీటి మునిగి నష్టపోయారు. వరి కోతలు కోసిన రైతులు రెండవ పైరుగా మినుము వేశారు. ఆ మినుము పంట కూడా నీటిలో మునిగి పోవటంతో రైతు ఆ పంట కూడా నష్టపోయాడు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. అలాగే సోమవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురవటంతో లోతట్టు ప్రాంతాలన్ని జలమయం అయ్యాయి. రహదారులు కూడా నీటితో నిండిపోయాయి.
నేలకొరిగిన వరిపైరు, విద్యుత్ స్తంభాలు
* ముందస్తు హెచ్చరికలతో తగ్గిన నష్టం
జి.కొండూరు, డిసెంబర్ 17: ఫెథాయ్ తుఫాన్ కారణంగా వరిపైరు నేలకొరిగింది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం సాయంత్రం వరకూ విస్తారంగా వర్షాలు కురిసాయి. ముందస్తు హెచ్చరికలతో కొంతమేర నష్టాన్ని నివారించగలిగారు. మండలంలో ఇంకా సుమారు 1500 ఎకరాల్లో వరిపైరు కోయాల్సి ఉండగా, ఇందులో దాదాపు 300 ఎకరాలకు పైగా వరిపైరు నేలకొరిగిందని, 78.3మీమీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. జి.కొండూరు వ్యవసాయాధికారి రామ్‌కుమార్, ఆర్‌ఐ షీమాబేగం, వీఆర్వో నాగులు తదితరులు దెబ్బతిన్న పొలాలను పరిశీలించారు. ఇక విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్ సరఫరాకు పాక్షికంగా అంతరాయం కలిగింది. జి.కొండూరు పోలీసు, రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులు రైతులను, ప్రజలను అప్రమత్తం చేయడంలో కృతకృత్యులయ్యారు. కాగా తుఫాన్ కారణంగా వరికోత యంత్రాలను వాడి వరికోత కోసి ధాన్యాన్ని తీయడంతో పశువులకు వరిగడ్డి దక్కకుండా నీటపాలయింది. అధికారులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు.