కృష్ణ

అన్ని పరీక్షలు రాసేందుకు వీలుగా డీఎస్సీ షెడ్యూల్‌లో మార్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: డీఎస్సీ 2018కి సంబంధించి అన్ని సబ్జెక్టుల పరీక్షలను అభ్యర్థులు రాసేందుకు వీలుగా షెడ్యూల్‌లో కొన్ని మార్పులు చేసినట్లు రాష్ట్ర పాఠశాల విద్య కమిషనర్ సంధ్యారాణి వెల్లడించారు. ఒక్కో అభ్యర్థి 4, 5 సబ్జెక్టులకు దరఖాస్తు చేశారని గుర్తు చేశారు. స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్ పరీక్షలో కొన్ని సబ్జెక్టులను ఈ నెల 28కి బదులుగా, 27వ తేదీ మధ్యాహ్నానికి మార్చామని తెలిపారు. పీజీటీ సబ్జెక్టులు 29వ తేదీన ఉండగా, 28వ తేదీ మధ్యాహ్నానికి మార్చామని తెలిపారు. పీజీటీలకు 29, 30 తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రిన్సిపాల్, మ్యూజిక్, క్రాఫ్ట్, ఆర్టు అండ్ డ్రాయింగ్ పరీక్షను జనవరి 2న కాకుండా 4న నిర్వహిస్తారు. 24 మంది అభ్యర్థులకు ప్రత్యేక సెషన్‌లో పరీక్ష నిర్వహించే ఏర్పాట్లు చేశారు. వీరికి ప్రత్యేక హాల్ టిక్కెట్లు జారీ చేస్తున్నామని వెల్లడించారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి పరీక్షను అభ్యర్థి రాసే విధంగా షెడ్యూల్‌లో మార్పులు చేశామని తెలిపారు.

వీసీల నియామకానికి సెర్చ్ కమిటీల ఏర్పాటు

విజయవాడ, డిసెంబర్ 17: రాష్ట్రంలోని నాలుగు విశ్వవిద్యాలయాలకు వైస్ చాన్సలర్ల నియామకానికి వీలుగా సెర్చ్ కమిటీలను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నియమించింది. ద్రవిడియన్ వర్సిటీ, ఆదికవి నన్నయ వర్సిటీ, పద్మావతి మహిళా వర్సిటీ, శ్రీవెంకటేశ్వర వర్సిటీలకు వీసీలను నియమించేందుకు వీలుగా ముగ్గురు సభ్యులతో సెర్చి కమిటీలను నియమించింది. వీసీగా నియమించేందుకు వీలుగా ముగ్గురి పేర్లను కమిటీ సిఫారసు చేయాల్సి ఉంటుంది. వీలైనంత త్వరగా పేర్లను సూచించాలని ఆ ఉత్తర్వుల్లో కోరింది. కాగా, వివిధ పాఠశాలల్లో పని చేస్తున్న 10,224 గ్రేడ్-2 లాంగ్వేజ్ పండిట్ల పోస్టులను స్కూల్ అసిస్టెంట్లు (లాంగ్వేజెస్)గా అప్‌గ్రేడ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మరో 2603 పీఈటీ పోస్టులను స్కూల్ అసిస్టెంట్ (పీఈ)గా అప్‌గ్రేడ్ చేసింది.