కృష్ణ

ఒక్క ధాన్యపు గింజా నష్టపోనివ్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జి.కొండూరు: రైతులు ఒక్క ధాన్యపు గింజకూడా నష్టపోకుండా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు హామీ ఇచ్చారు. గంగినేని గ్రామంలో జరిగిన గ్రామదర్శిని గ్రామవికాసంలో పాల్గొన్న మంత్రి ఉమాకు మాజీ సర్పంచ్ మంగలంపాటి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. జోడుపొట్టేళ్ళ బండిపై మంత్రి ఉమాను ఊరేగించారు. పొలాల్లోని రైతుల వరిపైరును, దెబ్బతిన్న ధాన్యాన్ని మంత్రి ఉమా పరిశీలించారు. మంత్రి ఉమా మాట్లాడుతూ తెలుగుదేశం చేతల ప్రభుత్వమన్నారు. అభివృద్ధి చేస్తుంటే ప్రతిపక్ష నేతలు కోర్టుకేసులతో ఇబ్బందులు పెడుతున్నారన్నారు. మైలవరం వైకాపా సీటును ప్రతిపక్ష నేత జగన్ కోట్ల రూపాయలకు అమ్ముకున్నాడన్నారు. ఇడి, సిబిఐ కేసుల్లో నిందితులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు గతంలో తనపై ఓడి పోయి మళ్ళీ ఇక్కడకు పోటీ కోసం వచ్చారన్నారు. డబ్బు మూటలతో వస్తున్న వారికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. గంగినేనిలో ఇంటింటికీ కుళాయి పథకంకు రూ.57.70లక్షలు కేటాయించామన్నారు. నియోజకవర్గంలో ఎత్తిపోతల పథకాలతో ప్రత్యక్షంగా పరోక్షంగా 16వేల ఎకరాలకు సాగునీరు లభించి, బోర్లు రీఛార్జ్ అయ్యాయన్నారు. నియోజకవర్గంలో 15వేల ఇళ్ళు ఇచ్చామన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం చేసిందే చెబుతుందన్నారు. అనంతరం మంగలంపాటి వెంకటేశ్వరరావు మామిడితోటలో జరిగిన తెలుగుదేశం పార్టీ మండల సమావేశంలో మంత్రి ఉమా మాట్లాడుతూ కులాలు, వర్గాలకు అతీతంగా ఐకమత్యంగా ఉండి, వైషమ్యాలు విడనాడి చేసిన అభివృద్ధి ప్రజలకు తెలియ చేయాలన్నారు.

చలిగాలలకు ఇద్దరు వృద్ధులు మృతి

హనుమాన్ జంక్షన్, డిసెంబర్ 18: పెథాయ్ తుఫాన్ ప్రభావంతో వీచిన చలిగాలులకు బాపులపాడు మండలంలో ఇద్దరు వృద్ధులు మృతి చెందారు. మండలంలోని పెరికీడుకు చెందిన కాపు దాసుమణి(60), ఆదినారయణ(70) సోమవారం రాత్రి మృతి చెందారు. మంగళవారం ఈ విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు మృతుల ఇళ్ళకు వెళ్ళి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మండల పార్టీ అధ్యక్షుడు వీరమాచినేని సత్యప్రసాద్, సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు కడగల శ్రీనివాసరావు తదితరులు వున్నారు.

సమర్థంగా ఎదుర్కొన్నాం

* మంత్రి ఉమ

మైలవరం, డిసెంబర్ 18: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పెథాయ్ తుఫాన్ వల్ల ఎటువంటి నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలతో సమర్ధవంతంగా ఎదుర్కొన్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక మార్కెట్ యార్డులో రైతులు ఆరబెట్టుకున్న ధాన్యాన్ని పరిశీలించారు. ఇస్రో, ఐఆర్‌టిజిఎస్ ద్వారా తుఫాన్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పత్రికలు, ఇతర మాధ్యమాల ద్వారా రైతులకు అందించి, అధికారులను అప్రమత్తం చేశామన్నారు. పనల మీద ఉన్న వరిని, యార్డులో ఆరబోసిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కాపాడామన్నారు. ఎక్కడైనా అనుకోని విధంగా ధాన్యం తడిస్తే ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. రైతుకు నష్టం జరగకుండా ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వమే ఆదేశాలు జారీ చేసిందన్నారు. రైతు సంక్షమమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అకాల వర్షాల వల్ల జరిగే నష్టాన్ని ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఇప్పటికే ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద మిల్లర్లు ధాన్యాన్ని తీసుకెళ్ళే విధంగా ఆదేశాలు ఇచ్చామన్నారు. మైలవరం యార్డులో బిపిటి రకం ధాన్యం కొంత ఉందని, అదే విధంగా గతంలో అమ్మకానికి తెచ్చిన పెసలను కూడా కొంటామని హామీ ఇచ్చారు. యార్డుకు వచ్చే ప్రతి రైతుకు న్యాయం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎఎంసి చైర్మన్ వుయ్యూరు నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.