కృష్ణ

24 గంటల్లో నివేదికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: పెథాయ్ తుఫాన్ కారణంగా పంట నష్టం అంచనాలపై 24 గంటల్లో నివేదికలు అందించాలని జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ద్వారా మంగళవారం ఆయన అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. 24గంటల్లో పంట నష్టం అంచనాలు తయారు చేసి 20వ తేదీ నాటికి రైతు ఖాతాలో నష్టపరిహారం జమ అయ్యే విధంగా వ్యవసాయ శాఖ, దాని అనుబంధ శాఖల అధికారులు పని చేయాలన్నారు. జిల్లాలో సుమారు 10వేల హెక్టార్లలో వరి, ఇతరత్రా పంటలు నీట మునిగినట్టు ప్రాథమికంగా గుర్తించడం జరిగిందన్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన మార్గదర్శకాల మేరకు ప్రోఫార్మాలో నమోదు చేసి రియల్ టైమ్ గవర్నెన్స్ (ఆర్టీజీ)కి పంపాలన్నారు. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ మార్గదర్శకాల ప్రకారం మూడు రోజుల పాటు నీట మునిగిన పంటలకు మాత్రమే నష్టపరిహారం అందించే నిబంధన ఉందన్నారు. జిల్లాలో ఈ నెల 16వ తేదీ నుండి 17వ తేదీ వరకు మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైందన్నారు. నీట మునిగిన పంటకు ఐదు శాతం సోడియం క్లోరైడ్ పిచికారి చేయడం వల్ల పంటకు నష్టం వాటిల్లదన్నారు. పరిహారం అందించడంలో మార్గదర్శకాలు కీలకంగా ఉన్నందున తదనుగుణంగా వ్యవసాయ శాఖాధికారులు పక్కాగా డేటాను నమోదు చేయాలన్నారు. 150 గ్రామాలను ఎన్యుమరేషన్ చేయడానికి ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిపారు. పంట నష్టం అంచనాల తయారీకి నోడల్ అధికారిగా నూజివీడు సబ్ కలెక్టర్ స్వప్నిల్ దినకర్‌ను నియమించినట్లు పేర్కొన్నారు. ఎక్కడా వర్షపునీరు నిల్వ లేకుండా చూడాలన్నారు. రెండు పూటలా బ్లీచింగ్, ఫాగింగ్ చేయించాలన్నారు. కాచి చల్లార్చిన నీటినే తాగే విధంగా ప్రజల్లో చైతన్యం కల్పించాలన్నారు. అవసరమైన అన్ని మందులను అందుబాటులో ఉంచుకుని ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా పాముకాటు, కుక్కకాటుకు సంబంధించిన మందులను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ విజయకృష్ణన్, నూజివీడు సబ్ కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ఇన్‌ఛార్జ్ డీఆర్‌ఓ పిడుగు బాబూరావు, ఆర్డీవో జె ఉదయ భాస్కర, వ్యవసాయ శాఖ జెడీ నాయక్, ఆర్‌డబ్ల్యుయస్ ఎస్‌ఇ సాయిప్రసాద్, ట్రైనీ డెప్యూటీ కలెక్టర్లు ఖాజావలీ, విజయలక్ష్మీ, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.