కృష్ణ

భేష్ కలెక్టర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: ‘పెథాయ్’ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం చేపట్టిన ముందస్తు చర్యలు సత్ఫలితాలనిచ్చాయి. ముచ్చెమటలు పట్టించిన తుఫాన్ కారణంగా జిల్లాలో చెప్పుకోదగ్గ నష్టం వాటిల్లలేదు. జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం తీసుకున్న కట్టుదిట్టమైన ముందస్తు చర్యలకు ప్రజలు హర్షిస్తున్నారు. తుపాన్ హెచ్చరికలు జారీ అయిన మరు క్షణం నుండి కలెక్టరేట్‌తో పాటు జిల్లాలోని నాలుగు డివిజన్‌ల ఆర్డీవో కార్యాలయాలు, తుపాను ప్రభావిత మండల తహశీల్దార్ల కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. మంగళవారం వాతావరణ శాఖ జారీ చేసిన చివరి డీ వార్మింగ్ బులెటన్ వరకు కలెక్టర్ కంట్రోల్ రూమ్‌లోనే ఉండి పరిస్థితులను సమీక్షించారు. రౌండ్ ది క్లాక్ కంట్రోలింగ్ ద్వారా వాతావరణ శాఖ, ఇస్రో, ఆర్టీజీ జారీ చేసిన హెచ్చరికలను ప్రతిక్షణం అవగతం చేసుకుని ముందస్తు రక్షణ చర్యలు చేపట్టి టెలీ కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు, జిల్లాకు చెందిన మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్రల అభినందనలు అందుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం నాలుగు రోజుల పాటు కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ద్వారా పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ క్షేత్ర స్థాయి సిబ్బందిని అప్రమత్తం చేస్తూ తీర ప్రాంత వాసుల్లో ధైర్యాన్ని నింపారు. కంట్రోల్ రూమ్‌లో అన్ని శాఖల నుండి ఒక్కొక్క అధికారిని నియమించి షిఫ్ట్‌ల వారీగా వారి సేవలను వినియోగించుకున్నారు. సముద్రానికి ఐదు కిలోమీటర్ల నుండి 35 కిలో మీటర్ల వరకు ఉన్న 181 తీర గ్రామాలను గుర్తించి వాటిని మూడు విభాగాలుగా విభజించి సహాయక చర్యలు చేపట్టారు. నాలుగు రోజుల పాటు 2400 మంది అధికారులు, ఉద్యోగులు తుఫాన్ సహాయక చర్యల్లో పాల్గొనడం విశేషం. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, ఫైర్, పోలీస్‌లతో తీర గ్రామాల్లో కవాతులు నిర్వహించి ప్రజలకు మేమున్నామని భరోసా కల్పించారు. వ్యవసాయ శాఖ ద్వారా 10వేల టార్ఫాలిన్‌లను రైతులకు అందచేశారు. అలాగే ధాన్యం కొనుగోలు కేంద్రాలు 24గంటలు పని చేసేలా చర్యలు చేపట్టారు. ఈదురు గాలుల వల్ల ఎక్కడా కూడా విద్యుత్‌కు అంతరాయం కలుగకుండా చూసేందుకు గాను 5వేల విద్యుత్ స్థంభాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రధానంగా కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినకుండా జిల్లాలో ఉన్న సుమారు 800 సెల్ టవర్స్‌కు డీజిల్ టాపింగ్ చేశారు. వీటి పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా నూజివీడు సబ్ సబ్ కలెక్టర్ స్వప్నిల్ దినకర్‌ను నియమించారు. అలాగే తాగునీటి సమస్య తలెత్తకుండా తుఫాన్ హెచ్చరికలు వెలువడిన వెంటనే అన్ని రక్షిత మంచినీటి పథకాల్లో క్లోరినేషన్ చేయించి 15 రోజులకు సరిపడా మంచినీటి నిల్వలను పెట్టారు. విద్యుత్ సమస్యను అధిగమించేందుకు అన్ని పంప్ హౌస్‌ల వద్ద జనరేటర్లను ఏర్పాటు చేయించారు. తీర గ్రామాల్లోని 404 రేషన్ దుకాణాల్లో ముందస్తుగానే జనవరి నెలకు సంబంధించిన రేషన్‌ను ఆయా తీర వాసులకు అందచేశారు.