కృష్ణ

జెడ్పీ సమావేశాలకు ప్రాధాన్యత ఏదీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, మే 17: ప్రజా సమస్యల పరిష్కార వేదికగా నిలవాల్సిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాలు క్రమేణా ప్రాధాన్యతను కోల్పోతున్నాయి. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కూలంకషంగా చర్చించి పరిష్కారం చూపాల్సిన ప్రజాప్రతినిధులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. కనీసం సమావేశాలకు రావాలనే ఆలోచన కూడా కొందరు చేయటం లేదు. మంత్రులు వస్తే ఎమ్మెల్యేలు రారు, ఎమ్మెల్యేలు వస్తే మంత్రుల హాజరు కానరాదు. ప్రతి మూడు నెలలకు ఒకసారి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ అధ్యక్షతన జరిగే జెడ్పీ సర్వసభ్య సమావేశాలకు వాస్తవానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. జిల్లావ్యాప్తంగా నెలకొన్న సమస్యలు, ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై పూర్తిస్థాయి చర్చ జరగాల్సి వుంటుంది. కానీ అలాంటి పరిస్థితి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాల్లో కనిపించడం లేదు. అధికార పక్షం వైఫల్యాలను ఎత్తిచూపాల్సిన ప్రతిపక్షం కూడా సరైన వాణి వినిపించడంలో విఫలమవుతోంది. మంగళవారం జెడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ అధ్యక్షతన జెడ్పీ సమావేశ మందిరంలో జరిగిన సర్వసభ్య సమావేశం ఇందుకు నిదర్శనంగా నిలుస్తుంది. గత మూడు సమావేశాలకు వరుసగా గైర్హాజరైన జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మంగళవారం జరిగిన సమావేశానికి వచ్చారు. ఆయనతో పాటు మరో మంత్రి కొల్లు రవీంద్ర కూడా హాజరయ్యారు. కానీ ఎమ్మెల్యేల హాజరు మాత్రం కానరాలేదు. పెనమలూరు శాసనసభ్యుడు బోడే ప్రసాద్ మినహా మిగిలిన ఎమ్మెల్యేలంతా డుమ్మాకొట్టారు. గతంలో జరిగిన సమావేశాలకు ముగ్గురో, నలుగురో ఎమ్మెల్యేలు వచ్చినా ఈ సమావేశానికి ఒకే ఒక్క ఎమ్మెల్యే రావడం గమనార్హం. దీన్నిబట్టి చూస్తుంటే జెడ్పీ సర్వసభ్య సమావేశం పట్ల వారికి ఏమాత్రం గౌరవం ఉందో తెలుస్తోంది. మంత్రుల పరిస్థితి కూడా ఇందుకు ఏమాత్రం భిన్నంగా లేదు. జిల్లా పరిషత్ పాలకవర్గం ఏర్పడిన తర్వాత ప్రస్తుత చైర్‌పర్సన్ అనూరాధ అధ్యక్షతన తొమ్మిది సర్వసభ్య సమావేశాలు జరిగాయి. ఈ తొమ్మిది సమావేశాలకు మంత్రుల హాజరు చూస్తే ముక్కున వేలేసుకునేలా ఉంది. జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు. జలవనరుల శాఖ మంత్రిగా మైలవరం ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు, బిసి సంక్షేమ శాఖ మంత్రిగా కొల్లు రవీంద్ర, వైద్య విద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా కామినేని శ్రీనివాస్ (బిజెపి) జిల్లాకు నేతృత్వం వహిస్తున్నారు. జెడ్పీ తొలి సర్వసభ్య సమావేశానికే మంత్రులు ఉమ, కామినేని శ్రీనివాస్ గైర్హాజరయ్యారు. మచిలీపట్నం ఎమ్మెల్యే, బిసి సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఒక్కరే సమావేశానికి హాజరయ్యారు. తర్వాత జరిగిన నాలుగు సమావేశాలకు వరుసగా హాజరైన మంత్రి దేవినేని వన్‌మాన్ షోగా సమావేశాలను నడిపించారు. తర్వాత జరిగిన మూడు సమావేశాలకు డుమ్మా కొడుతూ వచ్చారు. తొమ్మిదోసారి మంగళవారం జరిగిన సమావేశానికి హాజరై మళ్లీ వన్‌మాన్ షోగా సమావేశాన్ని నడిపించారు. ఇక మంత్రి కామినేని విషయానికొస్తే తొమ్మిది సమావేశాల్లో ఆయన రెండు సమావేశాలకు మాత్రమే హాజరయ్యారు. స్థానికంగా ఉండే మరో మంత్రి కొల్లు రవీంద్ర మాత్రం ప్రతి సమావేశానికి హాజరవుతూ వచ్చారు. కానీ మంత్రి ఉమ పాల్గొన్న సమావేశాల్లో మంత్రి రవీంద్ర ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు. ఏదిఏమైనా ఎంతో ప్రాధాన్యత కలిగిన జెడ్పీ సర్వసభ్య సమావేశాలకు ప్రజాప్రతినిధుల గైర్హాజరు పట్ల ప్రజలు పెదవి విరుస్తున్నారు.