కృష్ణ

రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం టిడిపిని బిజెపిలో విలీనం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడివాడ, మే 17: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం టిడిపిని బిజెపిలో విలీనం చేయాలని, ఓటుకు నోటు కేసు తరహాలో రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టవద్దని కృష్ణాజిల్లా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచించారు. మంగళవారం స్థానిక ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆయన విలేఖర్లతో మాట్లాడారు. టిడిపిలోకి వస్తేనే నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇస్తామని చెబుతున్న చంద్రబాబు తన పార్టీని బిజెపిలో విలీనం చేస్తే 24 గంటల్లో రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా, నిధులను ప్రధాని నరేంద్రమోదీ ఇస్తారన్నారు. ఒక టిఎంసీ నీటి కోసం బాబ్లీ ప్రాజెక్ట్ దగ్గర హైడ్రామా సృష్టించిన చంద్రబాబు రాష్ట్రానికి ఎగువన నాలుగు అక్రమ ప్రాజెక్ట్‌లను నిర్మిస్తున్నా నోరు మెదపక పోవడం దారుణమన్నారు. భవిష్యత్తులో డెల్టాలో సాగునీటి సమస్య ఎదురైతే అందుకు చంద్రబాబు ఒక్కరే బాధ్యులవుతారన్నారు.