కృష్ణ

మత్స్య రంగం అభివృద్ధికి కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటరు), మే 17: రాష్ట్రంలో మత్స్య రంగం అభివృద్ధికి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని రాష్ట్ర బిసి సంక్షేమం, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఈమేరకు రాష్ట్ర బడ్జెట్‌లో రూ.350కోట్లు కేటాయించినట్లు తెలిపారు. మండల పరిధిలోని క్యాంబెల్‌పేటలో 22 మంది మత్స్యకారులకు రూ.22లక్షల విలువైన వలలను మంగళవారం ఆయన పంపిణీ చేశారు. ఈసందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ వ్యవసాయం తర్వాత మత్స్య రంగం ఎంతో వృద్ధి సాధిస్తోందన్నారు. మత్స్య ఉత్పత్తులు అధికం కావాలంటే డీప్ సీ ఫిషింగ్ చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం మత్స్యకారులకు బోట్లు, వలలు సబ్సిడీపై అందిస్తున్నట్లు తెలిపారు. యాంత్రిక నావల మత్స్యకారులకు 50 శాతం సబ్సిడీపై లక్ష రూపాయలు యూనిట్ కాస్ట్‌తో వలలు పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి కాగిత వెంకటేశ్వరరావు, జెడ్పీటిసి లంకే నారాయణప్రసాద్, మార్కెట్ యార్డు చైర్మన్ గోపు సత్యనారాయణ, పోలాటితిప్ప సర్పంచ్ మోకా రాజు, ఎంపిటిసి అయోధ్య రామయ్య, మత్స్య శాఖ ఎడి జయరాజు, టిడిపి నాయకులు తలారి సోమశేఖర్, కుంచే నాని, మరకాని పరబ్రహ్మం, ఎంపిడివో జివి సూర్యనారాయణ, తహశీల్దార్ నారదముని పాల్గొన్నారు.