కృష్ణ

కళ్లకు కట్టిన మహిషాసుర మర్దిని నృత్య రూపకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కల్చరల్), ఏప్రిల్ 3: విశ్వానికంతటికీ తనే రాజునని తన మాటే అందరూ వింటూ అధీనంలో ఉండాలని, తల్లిని పూజించక కామంచే దుష్ట స్వభావం కలిగిన రాక్షసుడు మహిషాసురుని సంహరించిన ఘట్టాలను నాట్యాచారిణి ఉషామాధవి బృందం మహిషాసురమర్దిని రూపకం ద్వారా ప్రతిభాన్వితంగా ప్రదర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఆదేశానుసారం ఘంటసాల విఆర్ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల నిర్వహిస్తున్న వారాంతపు కళా ప్రదర్శనల్లో భాగంగా ఆదివారం సాయంత్రం అదే కళాశాల ప్రాంగణంలోని కళావేదికపై ఈ కూచిపూడి నృత్య రూపకం ప్రదర్శితమైంది. కళాశాల ప్రిన్సిపాల్ కెఎస్ గోవిందరాజన్ పర్యవేక్షించగా అధ్యాపకుడు పారుపల్లి సుబ్బరాయ ఫల్గుణ్ నిర్వహించారు. నర్తకీమణులుగా నాట్యాచారిణి ఉషా మాధవి (మహిషాసురునిగా), సి.సిరి (జగన్మాతగా), ప్రహర్షిత, స్నేహాంజలి, తనూజ, మెహర్ తన్వి, దుర్గా కల్యాణి, కల్యాణి, దిషాప్రియ, లఖియాని తదితర 15 మంది వారి వారి పాత్రల్లో చక్కగా అభినయిస్తూ ఆహూతుల అభినందనలందుకున్నారు. రూపకం అనంతరం భజమానస, నీలమేఘ శరీర, అలరులు కురియగ, అదివో అల్లదిగో వంటి అన్నమయ్య సంకీర్తనలు, రామదాసు కీర్తనలు సోలోగా ప్రదర్శించి వారి కృషిని ఆ అంశాల ద్వారా చాటుకున్నారు. కళా ప్రదర్శనలు ఇస్తున్న కళాకారులచే ఖాళీ ఓచర్లపై సంతకాలు పెట్టించుకుంటున్నారన్న వార్తలపై విమర్శలు చోటుచేసుకుంటున్నాయి.