కృష్ణ

ఇంటి పట్టా పేరుతో జవాబు పత్రం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం: ఇళ్ళ పట్టాల పేరుతో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేదలను పిచ్చోళ్ళను చేస్తున్నాడని వైకాపా మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఆరోపించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో గురువారం రాత్రి ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మంత్రి ఉమ తీరుపై మండి పడ్డారు. నియోజకవర్గ పేదలు మంత్రి ఉమకు పిచ్చోళ్ళ మాదిరిగా కనిపిస్తున్నారా అని ప్రశ్నించారు. గత మూడు మాసాలుగా నియోజకవర్గంలో వెయ్యి కోట్ల రూపాయల విలువైన ఇళ్ళ స్థలాలను పేదలకు పంపిణీ చేస్తున్నామని ప్రగల్భాలు పలికిన మంత్రి ఉమ చివరకు ఏం చేస్తున్నాడో ప్రజలు తెలుసుకోవాలన్నారు. పేదలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వటానికి తాము ఎంత మాత్రం వ్యతిరేకం కాదన్నారు. కానీ వారిని మోసం చేస్తున్నదానినే తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇళ్ళ స్థలాల పట్టాల పేరుతో జవాబుపత్రం అంటూ అర్థరాత్రి సమయంలో తహశీల్దార్ కార్యాలయంలో తెలుగుదేశం నేతలు, మంత్రి అనుచరులు యలమంచిలి శ్రీనివాస్ మరి కొందరు కలసి దొంగల్లాగా జవాబు పత్రాలను పంపిణీ చేస్తారా, ఇదేనా ప్రజాస్వామ్యం అంటూ కేపీ ధ్వజమెత్తారు. మూడు దశాబ్దాలుగా దాచేసిన ఇరిగేషన్ భూమిని తానే బయటికి తీయించానని గొప్పలు చెప్పుకున్న మంత్రి ఉమ అందులో ఉన్న 40 లక్షల రూపాయల విలువైన కలపను ఎటువంటి అనుమతులు లేకుండా యధేచ్ఛగా తన అనుచరుడు యలమంచిలి శ్రీనివాస్ చేత నరికించి ఆ సొమ్మును మంత్రి ఉమ తన ఖాతాలో వేయించుకున్నాడన్నారు. దీనిపై తాము తమ పార్టీ ఆధ్వర్యంలో ఇరిగేషన్, రెవెన్యూ, అటవీ అధికారులకు సమాచార చట్టం కింద వివరాలు అడిగితే ఇంత వరకూ ఇవ్వలేదన్నారు. ఇంతకుముందు కనిమెర్లలో కూడా ఇదే విధంగా ధృవీకరణ పత్రం పేరుతో అక్కడి ప్రజలకు ఇళ్ళ స్థలాలు ఇచ్చామంటూ చెప్పుకున్నాడని కేపీ విమర్శించారు. పూరగుట్టలో ఉన్న ఇరిగేషన్ భూమిని నిబంధనల ప్రకారం రెవెన్యూ భూమిగా మార్చి లే అవుట్ వేసి అప్రూవల్ పొందిన తర్వాతనే పేదలకు పంపిణీ చేయాలని నిబంధనలుంటే ఇందులో ఏ ఒక్క నిబంధనను అమలు చేయకుండా అధికార మదంతో మంత్రి ఉమ తన ఇస్టానుసారంగా వ్యవహరిస్తున్నాడన్నారు. అర్థరాత్రి సమయంలో తహశీల్దార్ కార్యాలయంలో జవాబు పత్రాలను అందించే విషయంలో మంత్రి అనుచరుల పాత్ర ఎందుకని ప్రశ్నించారు. మంత్రి ఉమ ఇక్కడ రెండు సార్లు గెలిచి తొమ్మిదిన్నరేళ్ళలో ఒక్క గజం స్థలాన్ని కూడా సేకరించకుండా గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి పేదల ఇళ్ళ స్థలాల కోసం కొనుగోలు చేసిన భూమిని తాజాగా తానే ఇస్తున్నట్లు చెప్పుకుంటూ తన పార్టీకి చెందిన వారినే అందులో అర్హులుగా ఎంపిక చేసుకుని నిబంధనలకు విరుద్ధంగా జాబితాలు తయారు చేశారని ఆరోపించారు. పూరగుట్టలో లాటరీ పద్దతిన ఇళ్ళ స్థలాలు ఇస్తామని చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్నాడని ఆరోపించారు. రికార్డుల ప్రకారం పూరగుట్ట భూమి నేటికీ ఇరిగేషన్ భూమిగానే చూపుతుందన్నారు. ఇరిగేషన్ భూముల ఇవ్వటానికి తహశీల్దార్‌కు ఏమి అర్హత ఉందన్నారు. మంత్రి ఉమ మాటలు విని అధికారులు అడ్డదిడ్డంగా వ్యవహరిస్తున్నారని చివరికి వారే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ విషయంలో ఇప్పటికే కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామని ఆయన స్పందించాలన్నారు. అంతేగాక దీనిపై ఈ నెల 11న జరిగే జన్మభూమి-మా వూరు కార్యక్రమంలో నిలదీస్తామని, తమకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు పలువురు పాల్గొన్నారు.