కృష్ణ

కోడి పందాలు ఉపేక్షించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: సంప్రదాయ ముసుగులో కోడి పందాలు, పేకాట వంటి జూదాలకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి గురువారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఎక్కడైనా కోడి పందాలు, పేకాట వంటి జూదాలు నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వస్తే సంబంధిత నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదన్నారు. కోడి పందాలు నిర్వహించే వారితో పాటు నిర్వహణ కోసం ఖాళీ భూములను ఇచ్చే వారిపై కూడా చర్యలు కఠినంగా ఉంటాయన్నారు. గ్రామాల్లో ప్రత్యేకంగా పందాలు నిర్వహించే స్థలాలపై పికెట్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కోడి పందాలు పేకాటను వారి ప్రవృత్తిగా ఎంచుకుని జీవిస్తున్న పందెం రాయుళ్లపై, కోళ్లకు కత్తులు కట్టే వారిపై బైండోవర్ కేసులు నమోదు చేస్తామన్నారు. గత పది రోజుల కాల వ్యవధిలోనే జిల్లాలో ఇటువంటి ప్రవృత్తి కలిగిన 242 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. పందాల నిర్వాహకులకు నోటీసులు సైతం అందచేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా పందాలు జరగకుండా సిబ్బందిని అప్రమత్తం చేశామన్నారు. సంక్రాంతి పండుగ అంటే పంటలు చేతికి వచ్చి బంధువులందరూ దరి చేరగా, ఆనందోత్సాహాల మధ్య జరుపుకునేదన్నారు.

ఉయ్యూరు గ్రామసభ రసాబాస

ఉయ్యూరు, జనవరి 10: నివేశన స్థలాలు, రుణమాఫీ, తుఫాన్ సహాయం వంటి అనేక అంశాలపై అధికార, ప్రతిపక్ష వైకాపా నేతల మధ్య వాగ్యుద్ధం చెలరేగగా, గురువారం జన్మభూమి గ్రామసభ అట్టుడికింది. స్థానిక 15, 16, 17 వార్డులకుగాను జన్మభూమి-మా ఊరు గ్రామసభను అధికారులు స్థానిక కాటూరు రోడ్డులో ఏర్పాటు చేసారు. మాజీ మంత్రి, వైకాపా నేత కేపీ సారధి ఈ గ్రామసభకు హాజరుకానున్నారని ముందుగా తెలియడంతో పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసారు. తొలుత సభలో ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొనగా, మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ ఖుద్ధూస్ తదితరులు వేదిక మీద ఉన్నారు. ఈ సమయంలో సారథి సభా ప్రాంగణానికి విచ్చేయగా, ఆయనను వేదికపైకి రావలసినదిగా రాజేంద్ర కోరారు. ప్రజాప్రక్షాన సమస్యలు అడిగేందుకు వచ్చిన తాను వేదిక నెక్కడం సమంజసం కాదని, తాను క్రిందనే ఉంటానని సారధి చెప్పారు. తన హయాంలో ఇచ్చిన నివేశన స్థలాలను ఇంతవరకూ లబ్ధిదారులకు ఎందుకు స్వాధీనం చెయ్యలేదని, ఇళ్ళ నిర్మాణం పేరుతో అధిక మొత్తంలో నిరుపేదల వద్ద సొమ్మును ఎందుకు వసూలు చేస్తున్నారని నిలదీసారు. ఈ లోగా పెనమలూరు శాసనసభ్యులు బోడే ప్రసాద్ సమావేశానికి హాజరు కావడం, సారధి అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంలో భాగంగా పరుష పదజాలాన్ని ఉపయోగించడం ఇరుపార్టీల కార్యకర్తల మధ్య వాగ్యుద్ధానికి దారి తీసింది. తీవ్ర గందరగోళం మధ్య ఇరుపక్షాలు ఒకరినొకరు తోసుకోవడంతో పోలీసులు రంగప్రవేశం చేసి సారధిని, వైకాపా నేతలను సమావేశం నుంచి బయటకు తీసుకువెళ్ళారు. అనంతరం ఇరుపక్షాలు విలేఖరులతో మాట్లాడుతూ ఉద్ధేశపూర్వకంగానే వైకాపా నేతలు సమావేశానికి వచ్చి ఉద్రిక్తతలు సృష్టించారని టీడీపీ నేతలు ఆరోపించగా, సమస్యలకు పరిష్కారం చూపలేకే అధికారపక్షం అలజడి సృష్టించి పోలీసులను ప్రయోగించిందని ఆరోపించారు. కాగా విజయవాడ ఏసీపీ విజయభాస్కర్, సీఐ విశ్వనాధం నేతృత్వంలో పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసారు.