కృష్ణ

నిరంతర విద్యుత్ ఘనత తమ ప్రభుత్వానిదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బంటుమిల్లి: రాష్ట్ర ప్రజలకు నిరంతర విద్యుత్‌ను సరఫరా చేస్తున్న ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావు అన్నారు. బంటుమిల్లిలో 11/33 కెవి విద్యుత్ సబ్ స్టేషన్ ఆవరణలో రూ.35.83కోట్లు ప్రపంచ బ్యాంక్ నిధులతో ఏర్పాటు చేసిన 132/33 కెవి విద్యుత్ ఉప కేంద్రాన్ని గురువారం ఎమ్మెల్యే కాగిత వెంకట్రావ్, ముడ చైర్మన్ బూరగడ్డ వేదవ్యాస్, బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావుతో కలిసి వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడుతూ ఈ విద్యుత్ ఉప కేంద్రం ద్వారా బంటుమిల్లి, కృత్తివెన్ను, అర్తమూరు, లక్ష్మీపురం, చేవేండ్ర, మూలలంక గ్రామాల్లో లో ఓల్టేజి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుండి నేటి వరకు విద్యుత్ సరఫరా నిరంతరాయంగా అందించామన్నారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద జరిగిన జన్మభూమి గ్రామసభలో పాల్గొన్న వారు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. రూ.4కోట్లతో గ్రామ పంచాయతీలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించిన మాజీ సర్పంచ్ యిల్లూరి పద్మావతి, గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ యిల్లూరి లీలాకృష్ణలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి విక్టర్, తెలుగు యువత నాయకుడు కాగిత కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.