కృష్ణ

పేదలను ఆదుకోవడమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జి.కొండూరు: పేదలను ఆదుకోవడమే తెలుగుదేశం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. జి.కొండూరులో గురువారం జరిగిన జన్మభూమి గ్రామసభలో మంత్రి ఉమ మాట్లాడుతూ ఏళ్ళ తరబడి నివాసం ఉంటున్న పేదలకు వారి భూములపై రిజిస్ట్రేషన్ చేయించుకునే హక్కు కల్పించాలనే ప్రధాన లక్ష్యంతోనే రికార్డుస్థాయిలో ఇళ్ళపట్టాలు, ఇళ్ళు పంపిణీ చేస్తున్నామన్నారు. నిబంధనల ప్రకారం పేదవారికి ఇళ్ళస్థలాలు రెగ్యులరైజ్ చేస్తున్నామన్నారు. ఇంకా మిగిలిపోయిన వారికి స్థలాలను గుర్తించి పంపిణీ చేస్తామన్నారు. చింతలపూడి ద్వారా గోదావరి నీటిని రప్పించి ఏడాదికి రెండు పంటలు పండించే అవకాశాన్ని మెట్టప్రాంతమైన మైలవరానికి కల్పిస్తానన్నారు. సిఎం చంద్రబాబు సంక్షేమ పథకాలను అమలు చేయడంలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నారన్నారు. రైతు రుణమాఫీ పథకాన్ని రికార్డు స్థాయిలో అమలు చేసింది ఎపి ఒక్కటేనన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉమ ఇళ్ళపట్టాలను పంపిణీ చేశారు. వివిధ సంక్షేమ పథకాల లబ్దిదారులకు వాటి ధృవీకరణ పత్రాలను అందచేశారు. ఐసిడిఎస్ ఆధ్వర్యంలో సామూహిక సీమంతాలు చేశారు. చిన్నారులకు భోగిపళ్ళు పోశారు. సంక్రాంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు విశేషంగా ఆకర్షించింది. చిరుధాన్యాలతో వంటకాలు, పోషకాలతో కూడిన స్టాల్స్‌ను పరిశీలించి మంత్రి ఉమ సంతృప్తి వ్యక్తం చేశారు. అంగన్‌వాడీ కార్యకర్తలకు స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు. ఎఎంసి చైర్మన్ వుయ్యూరు నరసింహారావు, పజ్జూరు వెంకయ్య, ఎంపిడిఒ లక్ష్మీకుమారి, తహశీల్దార్ స్వర్గం నరసింహారావు, ఆర్‌ఐ షీమాబేగం తదితరులు పాల్గొన్నారు.