కృష్ణ

ప్రజా సంక్షేమమే పరమావధిగా పని చేస్తున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడ్లవల్లేరు, : ప్రజా సంక్షేమమే పరమావధిగా ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య అన్నారు. గుడ్లవల్లేరులో శుక్రవారం జరిగిన జన్మభూమి గ్రామసభలో ఆయన పాల్గొన్నారు. తొలుత స్థానిక అంబేద్కర్ నగర్‌లోని భారత ఉప రాష్టప్రతి బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం పంచాయతీ కార్యాయం వద్ద ఏర్పాటు చేసిన గ్రామసభలో ప్రసంగించారు. 10వేల జనాభా కలిగిన గుడ్లవల్లేరులో వెయ్యి పెన్షన్‌లను అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో 54లక్షల మందికి రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం టీడీపీ అని అన్నారు. 80లక్షల మంది డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ కింద ఉచితంగా రూ.10వేలను చంద్రబాబు అందజేశారన్నారు. పట్టిసీమ ద్వారా డెల్టా రైతులకు సాగునీరు అందించారన్నారు. గంగిరెద్దుల ఆట, వర్ల రామయ్య, రావి వెంకటేశ్వరరావు హరిదాసుల వేషాలతో ఆకట్టుకున్నారు. చంద్రన్న బీమా చెక్కులు, పట్టాదార్ పాస్ పుస్తకాలు, డ్వాక్రా మహిళలకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గుడివాడ ఆర్డీఓ సత్యవాణి, ఐఎఎస్ అధికారి ఉషాకుమారి, జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు శాయన పుష్పవతి, ఎంపీపీ కొసరాజు విజయ భారతి తదితరులు పాల్గొన్నారు.

సమస్యలు పరిష్కరిస్తేనే ప్రజాభిమానం

బంటుమిల్లి, జనవరి 11: ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తే ప్రజలకు అధికారులపై నమ్మకం ఏర్పడుతోందని జిల్లా పంచాయతీ అధికారి, మండల ప్రత్యేక అధికారి ఆర్ విక్టర్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని ములపర్రు, నాగేశ్వరరావుపేట గ్రామాల్లో జన్మభూమి గ్రామసభలు జరిగాయి. ఈ సందర్భంగా విక్టర్ మాట్లాడుతూ గ్రామసభల ప్రారంభం నుండి ఆఖరి రోజు వరకు ఎక్కువ శాతం మంచినీరు, సాగునీటి సమస్యలపై ప్రజలు గళమెత్తారన్నారు. వృద్దాప్య, వికలాంగ, వితంతు, ఒంటరి మహిళలు పెన్షన్‌ల కోసం దరఖాస్తులు చేసుకున్నారని, వీటిని పరిష్కరించి త్వరలో పెన్షన్‌లు ఇచ్చేందుకు కృషి చేస్తామన్నారు. పారదర్శకత, సుస్థితర అభివృద్ధి, సుపరిపాలనపై శే్వత పత్రాన్ని విడుదల చేశారు. కార్యక్రమాల్లో ఎంపీడీఓ చింతా కళావతి, తహశీల్దార్ డివి శేఖరరావు తదితరులు పాల్గొన్నారు.