కృష్ణ

జర్నలిస్టులపై పోలీసుల దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, జన్మభూమి కార్యక్రమాన్ని కవర్ చేసే కార్యక్రమంలో ఉన్న ఇద్దరు జర్నలిస్టులపై పోలీసులు దాడి చేయటంతో జర్నలిస్టులంతా ఏకమై ఆందోళనకు దిగారు. వివరాలలోకి వెళితే జన్మభూమి కార్యక్రమం సందర్భంగా వైకాపా నేత కేపీ తన అనుచరులతో సభాస్థలికి రావటానికి ప్రయత్నించే సమయంలో పోలీసులకు, వైకాపా నేతలకు మధ్య ఘర్షణ జరుగుతోంది. ఈ సంఘటనను కవర్ చేస్తున్న సేన ప్రతినిధి మనె్న శ్రీనివాస్, సూర్య రిపోర్టర్ వైడిపి రెడ్డిలపై నూజివీడు సీఐ ఎం రామ్‌కుమార్, మరో ఎస్‌ఐ దాడి చేశారు. తాము విలేఖరులమని చెప్పినా వినకుండా అయతే ఏంటీ మేం పోలీస్ అంటూ దురుసుగా ప్రవర్తించి దాడికి దిగారు. దీంతో తమకు జరిగిన అన్యాయంపై ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(ఏపియుడబ్ల్యుజే) జిల్లా అధ్యక్షులు యు వెంకట్రావ్ నాయకత్వంలో జర్నలిస్టులంతా ఏకమై బోసుబొమ్మ సెంటరులో నల్లబ్యాడ్జీలు ధరించి ధర్నాకు దిగారు. వీరికి వైకాపా నేతలు కేపీ తన అనుచరులతో మద్దతు పలికారు. సీఐ రామ్‌కుమార్‌ను సస్పెండ్ చేయాలని, పోలీస్ జులుం నశించాలని, జర్నలిస్టుల ఐక్యత వర్థిల్లాలంటూ నినదించారు. ఈ దశలో నూజివీడు డీఎస్పీ ప్రసాదరావు జోక్యం చేసుకుని క్షమాపణ చెప్పినప్పటికీ సీఐ రామ్‌కుమార్ వచ్చి క్షమాపణ చెప్పే వరకూ తాము ఆందోళన విరమించేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. ఈ దశలో పోలీసులు వైకాపా నేత కేపీని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించగా పెడన మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ అక్కడికి చేరుకుని విలేఖర్లకు మద్దతుగా రోడ్డుపై బైఠాయించారు. దీంతో మరోమారు అక్కడ జర్నలిస్టులు, వైకాపా నేతలు, కార్యకర్తల నినాదాలతో మారుమోగింది. కొద్దిసేపటి తర్వాత డీఎస్పీ అక్కడికి చేరుకుని నేతలతో మాట్లాడి ర్యాలీగా పోలీసు స్టేషన్ వద్దకు తీసుకెళ్ళి అక్కడ తనతోపాటు సీఐ రామ్ కుమార్‌తో జర్నలిస్టులకు బహిరంగంగా క్షమాపణ చెప్పటంతో జర్నలిస్టులు ఆందోళన విరమించారు.

టీడీపీ - వైసీపీ బాహాబాహీ

ఉయ్యూరు, జనవరి 11: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని గ్రామాలలో నిర్వహించే కోడి పందాలను తలపించే విధంగా అధికార, ప్రతిపక్ష కార్యకర్తలు బాహాబాహీకి దిగడం, హోదా మరచి నేతలే పరుష పదజాలాలు ఉపయోగిండం మండలోని పెదఓగిరాల వద్ద శుక్రవారం జరిగింది. జన్మభూమి-మా ఊరు గ్రామసభను గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద అధికారులు ఏర్పాటు చేసారు. ఈ గ్రామ సభకు ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్, ఎమ్మెల్యే బోడే ప్రసాద్ హాజరుకానున్నారని, వీరితోపాటు మాజీ మంత్రి, వైకాపా నేత కొలుసు పార్ధసారధి కూడ హాజరుకానున్నారని తెలిసింది. గురువారం ఉయ్యూరు గ్రామసభలో జరిగిన ఉద్రిక్తతల నేపద్యంలో పెదఓగిరాల సభకు పోలీసులు బారీ బందోబస్తు ఏర్పాట్లు చేసారు. సమావేశానికి హాజరై ప్రజాసమస్యలు చర్చించేందుకు సారధి గ్రామానికి రాగా, ఆయనను గ్రామం వెలుపలే పోలీసులు నిలువరించారు. దీంతో ఆయన పోలీసులతో చర్చలు జరిపారు. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా తమకు సహకరించాలని ఎసిపి విజయభాస్కర్ తదితరులు సారధికి విజ్ఞప్తి చేసారు. ఈ నేపద్యంలో వివిధ గ్రామాలనుంచి భారీ సంఖ్యలో వైకాపా శ్రేణులు విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారి వద్దకు చేరుకున్నారు. ఈ లోగా గ్రామసభను ముగించుకొని శాసనసభ్యులు బోడే ప్రసాద్ తిరిగి వెళుతూ ఉండగా, ఎంఎల్‌ఎ డౌన్‌డౌన్ అంటూ కొంత మంది నినదించారు. దీంతో ఆగ్రహానికి గురైన బోడే తన వాహనం నుంచి క్రిందకు దిగి వైకాపా శ్రేణుల వద్దకు వచ్చేందుకు ప్రయత్నించారు. దీనిని ఆసరాగా తీసుకున్న టిడిపి పక్ష కార్యకర్తలు వైకాపా కార్యకర్తల మద్య తోపులాట చోటు చేసుకుంది. పరుషపదజాలంతో ఎంఎల్‌ఎ దూషించడం ఉద్రిక్తతను పెంచింది. ఇరుపక్షాలు ముష్టిగాతాలకు దిగడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి చెదరగొట్టారు. తనను సమావేశ ప్రాంతానికి పంపించక పోతే ఎంఎల్‌ఎనే తన వద్దకు రమ్మనండి చర్చిస్తానని సారధి పోలీసులకు తెలిపారు. దానికి పోలీసులు ససేమిరా అని, ఆయనను అక్కడి నుంచి పోలీస్టేషన్‌కు తరలించారు. కాగా ఉద్దేశ పూర్వకంగానే ఈ చర్యలకు పాల్పడ్డారని, ఇరుపక్షాలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోశారు. కాగా స్ధానిక 18, 19 వార్డులలో జరిగిన గ్రామసభలలో ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్, మున్సిపల్ చైర్మన్ అబ్ధుల్ ఖుద్ధూస్, కమిషనర్ రాంకుమార్ పాల్గొన్నారు.

గ్రామాభ్యుదయమే ప్రభుత్వ ధ్యేయం

* జన్మభూమి ముగింపు సభలో మంత్రి రవీంద్ర

మచిలీపట్నం, జనవరి 11: గ్రామీణ ప్రాంతాల అభ్యుదయమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర న్యాయ, క్రీడ, యువజన సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఆరవ విడత జన్మభూమి కార్యక్రమంలో భాగంగా చివరి రోజైన శుక్రవారం మండల పరిధిలోని చిన్నాపురంలో నిర్వహించిన ముగింపు సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గడిచిన నాలుగున్నర యేళ్లుగా రాష్ట్భ్రావృద్ధికి ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు. నిరుపేదల సంక్షేమం కోసం రాజీ లేని పాలన సాగిస్తున్నట్లు చెప్పారు. వృద్దాప్య, వితంతువులకు ఆసరగా ఉండేందుకు నాడు నందమూరి తారక రామారావు పెన్షన్‌లను తెర మీదకు తీసుకు వచ్చారన్నారు. పెన్షన్ల పంపిణీపై ముఖ్యమంత్రి చంద్రబాబు మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.150లు ఉన్న పెన్షన్‌ను ఐదు రెట్లు చేసిన ముఖ్యమంత్రి ఫిబ్రవరి నెల నుండి రూ.2వేలు ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారన్నారు. గ్రామాల్లో ఎన్టీఆర్ గృహాలు ఇప్పటి వరకు ఇస్తున్న రూ.1.5లక్షలు సబ్సిడీని రూ.2లక్షలకు పెంచినట్లు మంత్రి రవీంద్ర తెలిపారు.