కృష్ణ

వైద్య, ఆరోగ్య సేవల్లో కృష్ణా ఫస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: జిల్లాలో ప్రజలకు వైద్య ఆరోగ్య సేవలందించుటలో కృష్ణా జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచిందని కలెక్టర్ బీ లక్ష్మీకాంతం అన్నారు. నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి గురువారం వైద్య, ఆరోగ్య శాఖాధికారులతో సెల్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రస్తుత పరిస్థితిని కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఆసుపత్రుల్లోనే కాన్పులు నిర్వహించాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని జిల్లాలో 99.98 శాతం సాధించి జిల్లా రాష్ట్రంలో మొదటిగా నిలిచిందని అన్నారు. జిల్లాలో అనీమియాకు సంబంధించి కృష్ణాజిల్లాను ఇప్పటికే అనీమియా నియంత్రణ జిల్లాగా ప్రకటించామని తెలిపారు. జిల్లాలో గర్భిణుల్లో అనీమియా 11 గ్రాములు కంటే తక్కువగా ఉన్నవారి శాతం 40.36 శాతమని, 7 గ్రాములు కంటే తక్కువుగా ఉన్నవారి శాతం 0.44 శాతంగా ఉందని, రాష్ట్రంలో అన్ని జిల్లాల కంటే మెరుగైన ఫలితాలు సాధించామని కలెక్టర్ తెలిపారు. డిసెంబర్ మాసాంతానికి వచ్చిన నివేదిక ప్రకారం అంటువ్యాధులు 0.52 శాతం మాత్రమేనని, ఇతర వ్యాధులకు సంబంధించి 0.84 శాతం మాత్రమేనని, ఇది రాష్ట్రంలో అన్ని జిల్లాల కంటే అతి తక్కువ అని కలెక్టర్ లక్ష్మీకాంతం తెలిపారు.

కృష్ణా అగ్రస్థానం
*కలెక్టర్ లక్ష్మీకాంతం
విజయవాడ (ఎడ్యుకేషన్), జనవరి 17: వెనుకబడిన తరగతుల సంక్షేమానికి ప్రభుత్వం అందిస్తున్న పథకాల అమల్లో కృష్ణాజిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచిందని కలెక్టర్ బి లక్ష్మీకాంతం అన్నారు. నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖాధికారులతో గురువారం ఫోన్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రస్తుత పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వెనుకబడిన తరగతుల కార్పొరేషన్ ద్వారా ఈ ఆర్థిక సంవత్సరం 4వేల 194 మందికి 41.94 కోట్లు రుణాలు అందించాలని లక్ష్యం గా పెట్టుకున్నామని, ఇంతవరకు 6226 మందికి 38.45 కోట్లు రుణాలుగా అందించామని పేర్కొన్నారు. కాపు కా ర్పొరేషన్ ద్వారా 6012 మందికి 60.12 కోట్ల రుణాలు అందించాలనే లక్ష్యం కాగా ఇంతవరకు 7490 మందికి 49. 72కోట్లు రుణాలు అందించామన్నారు. 11 వివిధ ఫెడరేషన్‌లకు సంబంధించి జిల్లాలో 3957 మందికి 79.09 కోట్లు రుణాలు అందించాలని లక్ష్యం కాగా ఇంతవరకు 2278 మందికి 39.97 కో ట్లు బ్యాంకుల ద్వారా రుణాలు అందించామని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో బీసీ కార్పొరేషన్, కాపు కార్పొరేషన్, వివిధ ఫెడరేషన్ల ద్వారా స్వయం ఉ పాధి పథకాలను లబ్ధిదారులకు అం దించడంలో 13జిల్లాల కంటే కృష్ణాజిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచిందని ఆయన వివరించారు.