కృష్ణ

మహిళాభ్యుదయానికే ‘మహిళాశక్తి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, : రాష్ట్రంలోనే తొలిసారిగా మచిలీపట్నంలో మహిళాభ్యుదయం కోసం వినూత్న రీతిలో మహిళాశక్తి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ప్రతి మున్సిపల్ వార్డు, గ్రామ పంచాయతీ నుండి పది మహిళా గ్రూపులను గుర్తించి వారు ఎంచుకున్న రంగాల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ నెల 22వ తేదీన స్థానిక రెవెన్యూ కల్యాణ మంటపంలో ఈ శిక్షణ నిర్వహించనున్నట్లు తెలిపారు. పది గ్రూపుల చొప్పున మొత్తం 760 మంది డ్వాక్రా మహిళలకు శిక్షణ ఇస్తామన్నారు. చేతి వృత్తులు, తినుబండారాల తయారీ వంటి యూనిట్లను వారితో నెలకొల్పేందుకు బ్యాంకర్లను సైతం సంసిద్ధం చేసినట్లు తెలిపారు. ఒక్కొక్క గ్రూపుకు రూ.10 నుండి రూ.15లక్షలు వరకు బ్యాంక్ రుణం ఇప్పించి వారితో యూనిట్లు నెలకొల్పిస్తామన్నారు. యూనిట్లను నెలకొల్పటంతోనే కాకుండా కామన్ మార్కెటింగ్ సెంటర్ ద్వారా వారు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పించనున్నట్లు తెలిపారు. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమం రాష్ట్రంలోనే తొలిసారిగా బందరులో నిర్వహించతలపెట్టడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో మెప్మా పీడీ జివి సూర్యనారాయణ, మున్సిపల్ చైర్మన్ బాబాప్రసాద్, ఫ్లోర్ లీడర్ పల్లపాటి సుబ్రహ్మణ్యం, జెడ్పీటీసీ లంకే నారాయణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

యుగపురుషుడు ఎన్టీఆర్

మైలవరం, జనవరి 18: యుగపురుషుడు నందమూరి తారక రామారావు అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ వర్థంతి కార్యక్రమాలు శుక్రవారం ఇక్కడి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు తమ్ముళ్ళు ఎన్టీఆర్ వర్థంతిని పురస్కరించుకుని రక్తదానం చేశారు. వీరికి మంత్రి ఉమ సర్ట్ఫికెట్లు అందించిన అనంతరం మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికే తెలుగుదేశం ఏర్పాటైందన్నారు. పేదవానికి పట్టెడన్నం లభిస్తుందంటే అది ఎన్టీఆర్ చలవేనన్నారు. 35 ఏళ్ళ క్రితమే ఎన్టీఆర్ పేదలకు 35 రూపాయల పింఛను, రెండు రూపాయలకే కిలోబియ్యం, మహిళలకు చీరలు, వృద్ధులకు ధోవతులు అందించి నూతన పరిపాలనకు పునాదులు వేశారన్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవానికే తెలుగుదేశం పుట్టిందన్నారు. ఎన్టీఆర్ ఆశయాలను చంద్రబాబునాయుడు అమలు చేస్తూ పార్టీని బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పింఛను పధకాన్ని రెండువేల రూపాయలు చేసి పేదలకు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ వర్థంతిని పురస్కరించుకుని మైలవరం, గొల్లపూడి, కొండపల్లిలో తెలుగుతమ్ముళ్ళు రక్తదానం చేశారని వారిని అభినందించి సర్ట్ఫికెట్లు అందించారు. అంతకుముందు ఎన్టీఆర్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. తెలుగు తమ్ముళ్ళు బోసుబొమ్మ సెంటరులోని ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించిన అనంతరం స్థానిక ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు.