కృష్ణ

కారణజన్ముడు ‘ఎన్టీఆర్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, : తెలుగు వారి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు ఎన్టీ రామారావు కారణజన్ముడని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, మచిలీపట్నం అర్బన్ డెవలప్‌మెంట్ అధారిటీ (ముడ) చైర్మన్ బూరగడ్డ వేదవ్యాస్ అన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు 23వ వర్ధంతి కార్యక్రమాన్ని మచిలీపట్నంలో నిర్వహించారు. బస్టాండ్ సెంటరులోని ఎన్టీఆర్ నిలువెత్తు కాంస్య విగ్రహానికి మంత్రి రవీంద్ర, ముడ చైర్మన్ వేదవ్యాస్‌తో పాటు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ల జగన్నాధరావు, మున్సిపల్ చైర్మన్ బాబాప్రసాద్ తదితరులు పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పేదలకు అన్నదానం నిర్వహించారు. కోనేరుసెంటరులో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. స్వచ్చందంగా ముందుకు వచ్చి రక్తదానం చేసిన వారికి సర్ట్ఫికేట్స్ అందచేశారు. ఈ సందర్భంగా జరిగిన సభల్లో వారు మాట్లాడుతూ బడుగుల ఆశాజ్యోతి ఎన్టీఆర్ అన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో రారాజుగా ఎదిగిన ఎన్టీఆర్ రాజకీయ రంగంలో కూడా ప్రభంజనం సృష్టించారన్నారు. పేదల కష్టాలను గుర్తించి తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ తెలుగు వారి ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పారన్నారు. మహిళలకు సైతం ఆస్తి హక్కు కల్పించి ఆడబిడ్డలకు అన్నగా నిలిచారన్నారు. చౌక ధరల దుకాణాల ద్వారా రూ.2లకే బియ్యం అందించి పేదల ఆకలి బాధలు తీర్చారన్నారు. నాడు ఎన్టీఆర్ ప్రవేశ పెట్టిన పెన్షన్ విధానం నేడు ఎంతో మందికి జీవనాధారంగా మారిందన్నారు. ఎన్టీఆర్ రూ.36లు పెన్షన్ ఇవ్వగా నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ.2వేలుకు పెంచారన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపిచంద్, జెడ్పీటీసీ లంకే నారాయణ ప్రసాద్, ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, ఎఎంసీ చైర్మన్ చిలంకుర్తి తాతయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ పంచపర్వాల కాశీ విశ్వనాధం, ఫ్లోర్ లీడర్ పల్లపాటి సుబ్రహ్మణ్యం, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

ఆంధ్రుల ఆరాధ్య దైవం ఎన్టీఆర్

గుడ్లవల్లేరు, : ప్రజలే దేవుళ్లు, సమాజం దేవాలయమని ప్రజల మధ్యకు వచ్చి ఆరు నెలల్లో ఆంధ్రాను చుట్టి అధికారం చేపట్టిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు అని మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడు కొనకళ్ల నారాయణరావు అన్నారు. మండల పరిధిలోని మామిడికోళ్ల, విన్నకోట, వడ్లమన్నాడు, వేమవరం తదితర గ్రామాల్లో శుక్రవారం ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ నారాయణరావు మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్ని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన చిత్తశుద్ధిని చాటుకుంటున్నారన్నారు. పెన్షన్‌ను పది రెట్లు పెంచిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబు ఘన విజయం సాధిస్తారన్నారు. ఈ నేపథ్యంలో భారీ ర్యాలీగా 20 గ్రామాల్లోని ఎన్టీఆర్ విగ్రహాలను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యుడు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు, గుడివాడ నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, గుడివాడ మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, జెడ్పీ వైస్ చైర్‌పర్సన్ శాయన పుష్పవతి, ఎంపీపీ కొసరాజు విజయ భారతి, గుడివాడ అర్బన్ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని బాబ్జి, మండల టీడీపీ అధ్యక్షుడు, కొసరాజు బాపయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు.