కృష్ణ

ఈదురు గాలులకు దెబ్బతిన్న తోటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవనిగడ్డ, మే 20: మండల పరిధిలోని పలు గ్రామాలలో శుక్రవారం ఉదయం వరకు వీచిన ఈదురు గాలులకు పలు ప్రాంతాలలో రహదారులు దెబ్బతిన్నాయి. అలాగే పెద్ద పెద్ద చెట్లు పడిపోయాయి. మామిడి కాయలు రాలిపోవటంతో సంబంధిత రైతులు తీవ్రంగా నష్టపోయారు. అలాగే పలు గ్రామాలలో ఇటుకల పరిశ్రమ దెబ్బతింది. పరిశ్రమలకు అవసరమైన మట్టిని తవ్వి రహదారులపై తరలిస్తుండారు. ఈ కారణంగా మట్టి రహదారులపై పడి దట్టంగా పేరుకుపోయింది. ఈ నేపథ్యంలో ద్విచక్ర వాహన చోదకులు తీవ్ర ఇక్కట్ల పాలయ్యారు. వర్షం నీటితో పల్లపు ప్రాంతాలు నీటితో నిండాయి. విద్యుత్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. వాణిజ్య పంటలు సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. అరటి చెట్లు నేలకొరిగాయి. అత్యధిక విస్తీర్ణంలో సాగు చేసిన పసుపు పంట 70శాతానికి పైగా అరబోసి ఉంచటంతో రైతులు పట్టాలు కప్పి కాపాడుకున్నారు. దొండ, కాక తదితర కూరగాయల పంటలు కూడా దెబ్బతిన్నాయని ఆ రైతులు వాపోతున్నారు. రహదారులు చిత్తడిగా మారాయి.