కృష్ణ

టీడీపీ పథకాలతో వైసీపీ మైండ్ బ్లాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి: తెలుగుదేశం ప్రభుత్వం ప్రకటిస్తున్న సంక్షేమ పథకాలతో వైసీపీ నాయకుల మెదడు మొద్దుబారుతోందని ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన పేర్కొన్నారు. కొన్ని ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు ప్రకటనకే పరిమితమయ్యాయని, రాష్ట్రంలో లోటు బడ్జెట్‌లో ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్షేమ పథకాలు ప్రకటించటమే కాకుండా సంక్రమంగా అమలు చేస్తుండటంతో ప్రతిపక్షాలకు నోట మాట రావటం లేదన్నారు. ఏదో విధంగా అధికార పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలను కించపర్చేందుకు నిరాధారమైన ఆరోపణలతో బురదజల్లుతున్నారని ఆమె తీవ్రంగా విమర్శించారు. మొవ్వ మండల తెలుగుదేశం పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం పెదపూడిలో ఆదివారం సాయంత్రం జరిగింది. మండల పార్టీ అధ్యక్షుడు తాతా వీర దుర్గాప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఎమ్మెల్యే కల్పన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకర్గంలో ఇప్పటి వరకు రూ.11.50 కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వైద్యం చేయించుకోలేని పేదలకు అందజేశామన్నారు. దీనిలో భాగంగా ఆదివారం 19 మందికి రూ.7లక్షల 67వేల 30ల చెక్కులను ఆమె అందజేశారు. ఫిబ్రవరి 1, 2 తేదీలతో పాటు ఈ నెల చెల్లించాల్సిన రూ.1000 కలిపి ప్రతి ఒక్క లబ్ధిదారుడికి రూ.3 వేలు చెల్లించనున్నట్లు ఆమె తెలిపారు. డ్వాక్రా మహిళలకు 2వ విడత పసుపు, కుంకుమ పథకం ద్వారా రూ.10వేలు చెల్లించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లోని తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు ఒక్కో కుటుంబానికి స్మార్ట్ఫోన్ అంద చేయనున్నట్లు ఆమె తెలిపారు. వైకాపా కరపత్రమైన ఒక దినపత్రిక ద్వారా తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులపై బురదజల్లే కార్యక్రమాలను చేపట్టారన్నారు. సమావేశంలో తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి తాతా నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.