కృష్ణ

ఏడుగురు సీఐలకు స్థానచలనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: జిల్లాలో ఏడుగురు సర్కిల్ ఇన్‌స్పెక్టర్లకు స్థానచలనం కల్పిస్తూ ఏలూరు రేంజ్ డీఐజీ రవికుమార్ మూర్తి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. రేంజ్ పరిధిలో మొత్తం 29 మంది సీఐలను బదిలీ కాగా జిల్లా నుండి ఏడుగురు బదిలీ అయ్యారు. నూజివీడు సీఐగా పని చేస్తున్న ఎం రామకుమార్‌ను పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం సర్కిల్‌కు బదిలీ చేశారు. మచిలీపట్నం డీటీసీలో సీఐగా పని చేస్తున్న ఎం కిషోర్ బాబును తూర్పు గోదావరి జిల్లా మండపేట టౌన్ సర్కిల్‌కు, మచిలీపట్నం ఇనగుదురుపేట సీఐగా పని చేస్తున్న అబ్దుల్ నబీని జగ్గయ్యపేట సర్కిల్‌కు బదిలీ చేశారు. గుడివాడ-2 టౌన్‌లో అటాచ్డ్ సీఐగా పని చేస్తున్న డి వెంకటేశ్వరరావును ఆ స్టేషన్‌లోనే పూర్తి స్థాయి సీఐగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నందిగామ సీఐగా పని చేస్తున్న పి వెంకట రమణ, కైకలూరు సీఐగా పని చేస్తున్న వి రవికుమార్, జగ్గయ్యపేట సీఐగా పని చేస్తున్న కెఎన్‌వి జయకుమార్‌ను వీఆర్‌లో పెడుతూ ఆదేశాలు జారీ చేశారు. వీఆర్‌లో ఉన్న ఎం గీతా రామకృష్ణను నూజివీడు సర్కిల్‌కు, వీఆర్‌లో ఉన్న జి చెన్నకేశవరావును కైకలూరు సర్కిల్‌కు, వీఆర్‌లో ఉన్న కె అప్పలస్వామిని నందిగామ టౌన్ సర్కిల్‌కు బదిలీ చేశారు.

ప్రారంభమైన ఎన్నికల తాయిలాలు
మైలవరం, జనవరి 20: ఎన్నికల సమీపిస్తుండటంతో ప్రధాన రాజకీయ పక్షాలు ఎన్నికల తాయిలాలు ప్రకటిస్తూ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నాయని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి సీహెచ్ కోటేశ్వరరావు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక శ్రామిక భవన్‌లో జరిగిన మండల పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ప్రజలను మరో సారి మోసం చేసేందుకు అధికార టీడీపీ, వైసీపీ, బీజేపీలు ఎన్నికల తాయిలాలు ప్రకటిస్తున్నాయని, అధికార టీడీపీ నేతలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలలో బిజీగా గడుపుతోందని ఆరోపించారు. ఎన్నికల తాయిలాలపై సీపీఐ కార్యకర్తలు ప్రజలను అప్రమత్తం చేయాలని పిలుపునిచ్చారు. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మతోన్మాదులను రెచ్చగొట్టి హిందూయేతరులపై దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, మానభంగాలు చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. భక్తులు, అభ్యుదయ వాదులు, కవులు, రచయితలు, జర్నలిస్టులను హత్యలు చేయించటం, దేశద్రోహం కేసులు పెట్టిస్తూ రాజ్యాంగ విలువలను మంటగలుపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం లేదని, ప్యాకేజీ చాలని నాలుగున్నరేళ్ళుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నినదించి ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రజలలో వ్యతిరేకత వస్తుండటంతో ప్రత్యేక హోదా నినాదాన్ని భుజానికెత్తుకుని తానే హోదా కోసం పోరాటం చేస్తున్నట్లు ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. ఇటువంటి పరిస్థితులలో నూతన రాజకీయ ప్రత్యామ్నాయం కోసం సీపీఐ, సీపీఎం, జనసేన కూటమిని బలోపేతం చేయటానికి కార్యకర్తలంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో నియోజకవర్గ కార్యదర్శి బుడ్డి రమేష్, మండల కార్యదర్శి పివిఎల్ గణేశ్వరమ్మ, పెదబాలునాయక్, శివకృష్ణ, సీతయ్య తదితరులు ప్రసంగించారు. రత్నకుమారి, అజ్మీర భీముడు, ఫ్రానె్సస్, శ్రీరాములు, ఆనందబాబు తదితరులు పాల్గొన్నారు.