కృష్ణ

ఆంధ్రా ద్రోహికి స్నేహ హస్తమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: రాష్ట్ర ప్రయోజనాలను పరిగణలోకి తీసుకోకుండా ఆంధ్రా ద్రోహి అయిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహనరెడ్డి స్నేహ హస్తం అందించడం గర్హనీయమని ఎమ్మెల్సీ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు విమర్శించారు. స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ వ్యవహరిస్తున్న తీరును తూర్పారబట్టారు. ఒకటిగా ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టి ప్రత్యేక తెలంగాణ సాధించిన కేసీఆర్‌తో జగన్ చేతులు కలపడం స్వార్ధ రాజకీయాల కోసమేనని విమర్శించారు. అవగాహన రాహిత్యం, వాస్తవాలు మాట్లాడే నైజం లేని జగన్ సీఎం కుర్చీ కోసం కేసీఆర్‌తో జత కట్టారని నిప్పులు చెరిగారు. ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరాన్ని అడ్డుకోవడమే కేసీఆర్ ప్రధాన లక్ష్యమన్నారు. ఇప్పటికే ఆయన కుమార్తె కవితతో పాటు మరో ఏడుగురు గతంలోనే పోలవరం నిర్మాణంపై సుప్రీం కోర్టులో పిటీషన్లు వేశారన్నారు. ఈ విషయాలన్నీ జగన్‌కు తెలిసే కేసీఆర్‌తో జత కట్టారా అని ఆయన ప్రశ్నించారు. పోలవరంపై జగన్ చేస్తున్న అవినీతి ఆరోపణలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. ఇప్పటి వరకు పోలవరం నిర్మాణానికి 9వేల 877 కోట్ల రూపాయలు ఖర్చు చేయగా ఇందులో కేంద్ర ప్రభుత్వం 6వేల 727 కోట్లు ఇచ్చిందన్నారు. జగన్ మాత్రం 25వేల కోట్లు పోలవరంలో అవినీతి జరిగిందని ఆరోపించడం విడ్డూరంగా ఉందన్నారు. దీనిబట్టి చూస్తే పోలవరంపై జగన్ అభిప్రాయం ఏమిటో అర్థం అవుతోందన్నారు. కేసీఆర్‌తో జత కట్టిన జగన్‌కు 2019 ఎన్నికల్లో గుణపాఠం చవి చూడక తప్పదన్నారు. సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి బూరగడ్డ రమేష్ నాయుడు, టీడీపీ జిల్లా కార్యదర్శి పివి ఫణికుమార్ పాల్గొన్నారు.