కృష్ణ

టీడీపీకి ఆయువుపట్టు బీసీలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవనిగడ్డ: తెలుగుదేశం పార్టీకి బీసీలే ఆయువుపట్టు అని, వారికి న్యాయం చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశేష కృషి చేస్తున్నారని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. సోమవారం స్థానిక గాంధీ క్షేత్రంలో జయహో బీసీ సదస్సు ఈ నెల 23వ తేదీన రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్నందున అందుకోసం బీసీ నేతలతో బుద్ధప్రసాద్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ మాట్లాడుతూ ఈ నెల 24న అవనిగడ్డలో నియోజకవర్గ స్థాయిలో బీసీల సదస్సు నిర్వహించుకోవటం ద్వారా రాజమహేంద్రవరం వెళ్లేందుకు వ్యూహరచనలు రూపొందించాలన్నారు. అవనిగడ్డలో జరిగిన కార్యక్రమానికి మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణరావు, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కూడా పాల్గొంటారని, 90శాతం సబ్సిడీ పరికరాలు బీసీలకే అందించటం జరిగిందని బుద్ధప్రసాద్ గుర్తు చేశారు. డ్వాక్రా మహిళలు, రైతులకు ప్రణాళికలు రూపొందించటం జరుగుతుందని, భవిష్యత్తులో అమలు చేసేందుకు రాజమహేంద్రవరం సభలో ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటిస్తారన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా జరుగుతున్నాయని, పెన్షన్‌ల ద్వారా వృద్ధులు సుఖమయమైన జీవితం కొనసాగిస్తున్నారని, వారికి బాధ్యతతో పాటు భరోసా కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ వెంకటేశ్వరరావు, ఎంపీపీలు తుమ్మల చౌదరి, ఎం జయలక్ష్మి, టీడీపీ నేత ఎన్ జనార్ధనరావు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా శ్రీ సువర్చలాంజనేయస్వామి కల్యాణం
అవనిగడ్డ, జనవరి 21: స్థానిక శ్రీ సువర్చలా సమేత శ్రీ ఆంజనేయ స్వామివారి వార్షిక కల్యాణ మహోత్సవం సోమవారం కన్నుల పండువగా జరిగింది. దీవి బాలకృష్ణమాచార్యులు దంపతులు కల్యాణ మహోత్సవం నిర్వహించగా ఆగమ పండితులు దీవి వెంకట సాయి ఫణికృష్ణ బ్రహ్మత్వంలో కల్యాణోత్సవం జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విశేష పూజలు నిర్వహించారు. అర్చక స్వాములు డి నరసింహమూర్తి, అప్పలాచార్యులు, వేణుగోపాలాచార్యులు, పార్థసారథి ఆచార్యులు, ధన్వంతరి ఆచార్యులు, వాసుదేవ కృష్ణమాచార్యులు పాల్గొనగా ఆలయ ఇఓ మోహనరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
స్ర్తిని వేధింపులకు గురి చేస్తే గృహ హింస చట్టం కింద చర్యలు - న్యాయమూర్తి గురు అరవింద్
మచిలీపట్నం (కోనేరుసెంటరు) జనవరి 21: మహిళలను వివాహం చేసుకున్న తరువాత మానసికంగా, శారీరకంగా భర్త, భర్త తరపు బంధువులు వేధింపులకు గురి చేస్తే గృహహింస చట్టం కింద చర్యలు తీసుకోవటం జరుగుతుందని మచిలీపట్నం 2వ అదనపు జుడీషయల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కె గురు అరవింద్ అన్నారు. స్థానిక బలరామునిపేటలో సోమవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మెజిస్ట్రేట్ అరవింద్ మాట్లాడుతూ మహిళలకు న్యాయ విజ్ఞాన సదస్సు ఉచిత న్యాయ సహాయం అందిస్తుందని తెలిపారు. వివాహం జరిగిన తరువాత భర్త గానీ, భర్త తరుపు కుటుంబ సభ్యులు గానీ, బంధువులు గానీ భార్యను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురి చేయడం నేరమన్నారు. అలా చేస్తే గృహహింస చట్టం 2005 ప్రకారం చర్యలు తీసుకోవటం జరుగుతుందన్నారు. స్ర్తిలకు 18 సంవత్సరాలు, పురుషులకు 21 సంవత్సరాలు నిండనిదే వివాహం చేయరాదని, అలా చేస్తే శిక్షలు కఠినంగా ఉంటాని హెచ్చరించారు. న్యాయవాది చీలి ముసలయ్య పోక్స్ చట్టం గురించి అవగాహన కల్పించారు. ఎస్‌ఐ వెంకటేశ్వరరావు మోటారు వాహనాల చట్టం గురించి వివరించారు. ఈ సదస్సులో కౌన్సిలర్ దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.