కృష్ణ

జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజాదివస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటర్): జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజాదివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అడిషనల్ పోలీసు సూపరింటెండెంట్ సోమంచి సాయికృష్ణ వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి వారి సమస్యలను అర్జీల రూపంలో స్వీకరించారు. వారి వారి అర్జీలపై తక్షణ పరిష్కార చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.

పంచాయతీ నిధుల వినియోగంపై నాల్గవ ఆర్థిక సంఘం అరా

మచిలీపట్నం, జనవరి 21: జిల్లాలోని గ్రామ పంచాయతీ నిధుల వినియోగంపై నాల్గవ ఆర్థిక సంఘం అరా తీసింది. నాల్గవ ఆర్థిక సంఘం చైర్మన్ జి నాంచారయ్యతో పాటు సంఘ సభ్యులు క్షేత్ర పర్యటనలో భాగంగా సోమవారం జిల్లా కేంద్రం మచిలీపట్న ం వచ్చారు. తొలుత జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిధుల వినియోగం, గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శించారు. పలువురు ప్రజా ప్రతినిధుల్లో గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ఆర్థిక సంఘం దృష్టికి తీసుకు వెళ్లారు. చాలీ చాలని నిధులతో పాటు గ్రామ పంచాయతీ కార్యదర్శుల కొ రత, ప్రత్యేక అధికారుల కారణంగా అ నేక సమస్యలు ఎదురవుతున్నాయని ఆర్థిక సంఘం చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఇఓ షేక్ సలీం, డెప్యూటీ సీఇఓ కృష్ణమోహన్, జిల్లా పంచాయతీ అధికారి విక్టర్ తదితరులు పాల్గొన్నారు.

పెండింగ్ అర్జీలన్నింటినీ సత్వరం పరిష్కరించాలి
* జెసీ-2 బాబూరావు
మచిలీపట్నం (కోనేరుసెంటరు) జనవరి 21: పెండింగ్‌లో ఉన్న మీకోసం అర్జీలన్నింటినీ తక్షణమే పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్-2 పి బాబూరావు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ‘మీకోసం’ అర్జీల స్వీకరణ కార్యక్రమం జరిగింది. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి జెసీ-2 బాబూరావు, డీఆర్‌ఓ లావణ్య వేణిలు అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జెసీ-2 మాట్లాడుతూ ఇటీవల నిర్వహించిన ఆరవ విడత జన్మభూమిలో పెన్షన్, రేషన్ దరఖాస్తులు తీసుకున్నప్పటికీ పెన్షన్ మంజూరు కొరకు ఇంకా దరఖాస్తులు వస్తున్నాయని, గృహ నిర్మాణ సమస్యలు, భూ ఆక్రమణల సమస్యలపై అర్జీలు ఎక్కువగా వస్తున్నాయని సత్వరమే పరిష్కరించాలన్నారు. ముఖ్యంగా పోలీస్ శాఖకు సంబంధించిన అర్జీలు ఎక్కువగా పెండింగ్‌లో ఉంటున్నాయని, ఆయా పోలీస్ స్టేషన్ల వారీగా పెండింగ్ అర్జీలను పరిష్కరించాలని ఎస్‌ఐలకు తగు ఆదేశాలు ఇవ్వాలన్నారు. జన్మభూమిలో అన్ని గ్రామాల విజన్ డాక్యుమెంట్ తయారు చేయడం జరిగిందని, ఆయా గ్రామాల్లో ఇంకా అభివృద్ధి చేయాల్సిన రోడ్లు, వౌలిక వసతులు ఇందులో చేర్చడం జరిగిందని, ప్రభుత్వం దశల వారీగా మంజూరు చేస్తుందని అర్జీదారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ జె ఉదయ భాస్కర్, ట్రైనీ డెప్యూటీ కలెక్టర్ ఖాజావలి, ఎస్‌సీ కార్పొరేషన్ ఈడీ ఎవివి సత్యనారాయణ, డీఎంఅండ్‌హెచ్‌ఓ డా. ఐ రమేష్, మత్స్యశాఖ జెడీ యాకూబ్ భాషా, హౌసింగ్ పీడీ ధనుంజయ్ తదితరులు పాల్గొన్నారు.