కృష్ణ

రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ‘ఇంద్రకీలాద్రి’ పేరు పెట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఇంద్రకీలాద్రి): హైదరాబాద్, బందరు నుండి విజయవాడ వచ్చే రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ఇంద్రకీలాద్రి పేరు పెట్టాలని దుర్గగుడి ట్రస్ట్ బోర్డు సమావేశం తీర్మానించిందని, ఈమేరకు ప్రతిపాదనలను ఆమోదించాలని కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఈవో వీ కోటేశ్వరమ్మ తెలిపారు. పాతబస్తీ మాడపాటి వేంకటేశ్వరరావు విశ్రాంతి భవనంలో సోమవారం ఉదయం జరిగిన విలేఖరుల సమావేశంలో దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ వీ గౌరంగబాబు, ధర్మకర్తలతో కలిసి ఆమె మాట్లాడారు. రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ఇంద్రకీలాద్రి పేరు పెట్టాలనేది ట్రస్ట్ బోర్డు, భక్తుల కోరికగా ఆమె తెలిపారు. తమ ప్రతిపాదనను కేంద్రం ఆమోదిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో దశాబ్దాలుగా పనిచేస్తున్న ఎన్‌ఎంఆర్‌లకు జీతాలు పెంచాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. దేవస్థానంలో పదేళ్ల సర్వీస్ పూర్తిచేసిన ఉద్యోగుల జాబితా రూపొందించి వారికి పెంచిన జీతాలు చెల్లిస్తామన్నారు. ఆధ్యాత్మిక కేంద్రమైన అమ్మవారి సన్నిధిలో ఏ పార్టీ నాయకులు కూడా రాజకీయ ప్రసంగాలు చేయరాదని ఇప్పటికే కోరామని ఆమె తెలిపారు. అమ్మవారి సన్నిధిలో ప్లాస్టిక్ సంచుల వినియోగాన్ని పూర్తిస్థాయిలో నిషేధించటానికి అవసరమైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రస్తుతం మల్లిఖార్జున మహామండపం 3వ అంతస్తులో వంటశాల ఏర్పాటుకు చర్యలు చేపట్టామన్నారు. దీని నిర్మాణంలో దాతలను భాగస్వాముల్ని చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు ఈవో కోటేశ్వరమ్మ వివరించారు.