కృష్ణ

‘పోర్టు’కు ముహూర్తం ఖరారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: పోరాటాల ద్వారా సాధించుకున్న బందరు ఓడరేవు నిర్మాణ పనులు ఈ నెల 31వతేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు మచిలీపట్నం అర్బన్ డెవలప్‌మెంట్ అధారిటీ (ముడ) చైర్మన్ బూరగడ్డ వేదవ్యాస్ స్పష్టం చేశారు. సోమవారం తన ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశానికి ఆయన మాట్లాడుతూ పోర్టు పనుల ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. 31వతేదీన సీఎం చేతుల మీదుగా పనులు ప్రారంభించేందుకు నవయుగ సంస్థ ప్రతినిధులు ముందుకు వచ్చారన్నారు. దీంతో ఈ ప్రాంతల చిరకాల స్వప్నం నెరవేరబోతోందన్నారు. గత పాలకులు శంకుస్థాపనలు చేసి ఉత్సవాలు జరుపుకున్నారన్నారు. తమ ప్రభుత్వం పార్టీ పోర్టు నిర్మాణ పనుల ప్రారంభానికి ప్రతిబంధకంగా మారిన ఒక్కొక్క సమస్యను అధిగమిస్తూ పనుల ప్రారంభానికి మార్గం సుగమం చేసినట్లు తెలిపారు. పోర్టు నిర్మాణంతో ఈ ప్రాంత రూపురేఖలు మారిపోనున్నాయన్నారు. ఉద్యోగ, ఉపాధి కేంద్రంగా బందరు విరాజిల్లనుందన్నారు. పోర్టుకు అవసరమైన 4వేల 800 ఎకరాల్లో 3వేల 100 ఎకరాలు ప్రభుత్వ, అసైన్డ్ భూములను సేకరించడం జరిగిందన్నారు. ల్యాండ్ పూలింగ్‌లో 700 ఎకరాలు సేకరించగా భూమి కొనుగోలు పథకం కింద 400 ఎకరాలు కొనుగోలు చేశామన్నారు. దీంతో మొత్తం 4వేల 200 ఎకరాలు సేకరణ పూర్తయిందన్నారు. ఇంకా 600 ఎకరాలు మాత్రమే సేకరించాల్సి ఉందన్నారు. రోడ్డు కనెక్టవిటీ కోసం మేకావానిపాలెంలో 122 ఎకరాలు భూమిని సర్వే చేశామన్నారు. ఈ భూమిని సేకరించేందుకు ఎకరానికి రూ.40లక్షలు భూమి కొనుగోలు పథకం కింద ఇచ్చేందుకు ప్రభుత్వం జీవో సైతం జారీ చేసిందన్నారు. పోర్టు పనుల ప్రారంభానికి ముందే ఈ భూములను కొనుగోలు చేసి నవయుగ సంస్థకు అప్పగిస్తామన్నారు. భూమి కొనుగోలుకు సంబంధించి బ్యాంక్‌ల నుండి రావల్సిన రూ.1385 కోట్లు రుణం కూడా వారం రోజుల్లో మంజూరయ్యే అవకాశాలు ఉన్నాయని వేదవ్యాస్ తెలిపారు.