కృష్ణ

రహదారుల అభివృద్ధికి రూ.62.89 కోట్లు మంజూరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం: మైలవరం నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి 62.89 కోట్ల రూపాయలు మం రయ్యా యని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వెల్లడించారు. స్థానిక విలేఖర్లతో ఆయన మంగళవారం మాట్లాడుతూ ఇందులో బీటి రోడ్లకు 10.653 కోట్ల రూపాయలు, గ్రావెల్ రోడ్లకు 5.72 కోట్ల రూపాయలు, ఆర్‌అండ్‌బి రహదారులకు 30.25 కోట్ల రూపాయలు, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు 3.05 కోట్ల రూపాయలు మంజూరైనట్లు తెలిపారు. రెడ్డిగూడెం మండలం రెడ్డిగూడెంలో కోతుల వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి 60 లక్షల రూపాయలు మంజూరైనట్లు తెలిపారు. అదేవిధంగా సాయన్నపాలెం నుండి నూజివీడు లింకురోడ్డుకు మూడు కోట్ల రూపాయలు, రంగాపురం నుండి నరుకుళ్ళపాడుకు 1.05 కోట్ల రూపాయలు, జి కొండూరు మండలం ఆత్కూరు నుండి పినపాక గ్రామానికి 1.75 కోట్ల రూపాయలు, మైలవరం మండలం మైలవరం నుండి పూరగుట్ట అప్రోచ్ రోడ్డుకు ఒక కోటి రూపాయలు, గణపవరం నుండి టి గన్నవరం రోడ్డుకు 90 లక్షల రూ పాయలు, జి కొండూరు మండలం గడ్డమణు గు గ్రా మం నుండి విద్యానగర్ వరకూ రోడ్డు నిర్మాణానికి 1.30 కోట్ల రూపాయలు మంజూరైనట్లు తెలిపారు. ఇవి కాక గ్రావెల్ రహదా రుల నిర్మాణానికి మైలవరం మండలానికి 2.06 కోట్ల రూపాయలు, రెడ్డిగూడెం మండలానికి 1.42 కోట్ల రూపాయలు, జి కొండూరు మండలానికి 1.91 కోట్ల రూపాయలు, ఇబ్రహీంపట్నం మండలానికి 33 లక్షల రూపాయల నిధులు మంజూరైనట్లు తెలిపారు. ఆర్‌అండ్‌బి రహదారులలో భాగంగా కొండపల్లి ఖిల్లాకు వెళ్ళే రోడ్లు మరమ్మతులకు 9.25 కోట్ల రూపాయలు, కందులపాడు నుండి గంగినేనిపాలెంకు వెళ్ళే రోడ్డుకు నాలుగు కోట్ల రూపాయలు, గంగినేనిపాలెం నుండి ఎర్రుపాలెం వెళ్ళే రోడ్డుకు 17కోట్ల రూపాయలు మంజూరైనట్లు మంత్రి ఉమ వెల్లడించారు.

ఎస్పీ త్రిపాఠికి సెలక్షన్ గ్రేడ్ ఐపీఎస్

మచిలీపట్నం, జనవరి 22: సెలక్షన్ గ్రేడ్ ఐపీఎస్‌గా జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సర్వశ్రేష్ఠ త్రిపాఠికి పదోన్నతి లభించింది. 2006 బ్యాచ్‌కు చెందిన మొత్తం 11 మంది ఐపీఎస్‌లకు రాష్ట్ర ప్రభుత్వం సెలక్షన్ గ్రేడ్ ఐపీఎస్‌లుగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో జిల్లా ఎస్పీగా పని చేస్తున్న సర్వశ్రేష్ఠ త్రిపాఠి కూడా ఉండటం విశేషం. ఎస్పీగా త్రిపాఠి 2017 జూన్ 28వ తేదీన బాధ్యతలు స్వీకరించారు. నాటి నుండి నేటి వరకు జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ నేర నియంత్రణకు విశేష కృషి చేస్తున్నారు.