కృష్ణ

మహాశక్తివంతులుగా మహిళలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: మహిళలను మహాశక్తిగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర న్యాయ, క్రీడ, యువజన, నైపుణ్యాభివృద్ధి సంస్థ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, కొల్లు ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే తొలిసారిగా మచిలీపట్నంలో మంగళవారం మెగా మహిళా వ్యవస్థాపక అవగాహనా సదస్సు నిర్వహించారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుండి, ప్రతి మున్సిపల్ వార్డు నుండి పది డ్వాక్రా గ్రూపులను ఎంపిక చేసి గ్రూపు సభ్యులకు వారు ఎంచుకున్న రంగాల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వడమే మెగా మహిళా వ్యవస్థాపక సదస్సు లక్ష్యమన్నారు. బందరు నియోజకవర్గంలో 5 వేల డ్వాక్రా సంఘాలు ఉండగా 50వేల మంది మహిళలకు బ్యాంక్‌ల ద్వారా లింకేజీ రుణాలు ఇస్తున్నామన్నారు. వీటి ద్వారా యూనిట్లు స్థాపింప చేసి వారు తయారు చేసే ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించి మహిళలను పారిశ్రామిక, ఆర్థికవేత్తలుగా తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో మచిలీపట్నం ఉత్పత్తి కేంద్రంగా ప్రాచుర్యం పొందాలనే ఉద్దేశంతో ఇటువంటి సదస్సును తొలిసారిగా ఈ ప్రాంతంలో నిర్వహించామన్నారు. స్థానికంగా ప్రసిద్ధి చెందిన రోల్డుగోల్డు, మత్స్య పరిశ్రమ, వ్యవసాయ రంగం మాత్రమే కాకుండా తినుబండారాలు, పేపర్ ప్లేట్లు, పచ్చళ్లు తయారీ, అల్లికలు వంటి వివిధ రకాలైన 100 నుండి 150 వరకు యూనిట్లు గుర్తించి వాటి ఏర్పాటు, మార్కెటింగ్ తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారన్నారు. బందరు లడ్డు తయారీకి పేరొందిన ఈ ప్రాంతంలో 5వేల పరిశ్రమల ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. వివిధ ట్రేడ్‌లలో శిక్షణ పూర్తి చేసిన వారికి ఈ నెల 31వ తేదీన పోర్టు పనుల ప్రారంభోత్సవానికి వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా సర్ట్ఫికేట్స్ అందిస్తామన్నారు. బందరు పోర్టు అభివృద్ధి, పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుతో బందరు ఉపాధి అవకాశాలకు నెలవుగా రూపుదిద్దుకోబోతోందన్నారు. మచిలీపట్నం అర్బన్ డెవలప్‌మెంట్ అధారిటీ (ముడ) ద్వారా పోర్టు నిర్మాణం కోసం సేకరించిన భూముల్లో 500 ఎకరాలు కేటాయిస్తే మహిళా పారిశ్రామిక ప్రాంగణం ఏర్పాటు చేయుటకు కృషి చేస్తామన్నారు. ప్రతి నియోజకవర్గంలో 100 ఎకరాల్లో ఉపాధి యూనిట్లు పెట్టించాలన్నది ముఖ్యమంత్రి ఆలోచన అన్నారు. ఇందులో 40శాతం మహిళలకు కేటాయించనున్నట్లు తెలిపారు. ముడ వైస్ చైర్మన్ పి విల్సన్‌బాబు మాట్లాడుతూ పోర్టు నిర్మాణంతో ఈ ప్రాంతం పారిశ్రామికంగా గణనీయమైన అభివృద్ధి సాధించగలదన్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శిక్షణా కేంద్రం డైరెక్టర్ సాయిబాబా మాట్లాడుతూ మహిళలు యూనిట్ల ఏర్పాటు చేసుకునే వారికి ఎంతైనా రుణం ఇవ్వడానికి తమ బ్యాంక్ సిద్ధంగా ఉందని తెలిపారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్రధాన సలహాదారు కొండయ్య మాట్లాడుతూ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయుటకు ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందన్నారు. జిల్లా పరిశ్రమల కేంద్రం డెప్యూటీ డైరెక్టర్ వెంకట్రావ్ మాట్లాడుతూ పరిశ్రమల శాఖ ద్వారా ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీ సౌకర్యాలు, అనుమతుల గురించి సవివరంగా తెలియచేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బాబాప్రసాద్, వైస్ చైర్మన్ పంచపర్వాల కాశీ విశ్వనాధం, ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, జెడ్పీటీసీ లంకే నారాయణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.