కృష్ణ

నేడు బందరులో మినీ మహానాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటర్), మే 20: జిల్లా కేంద్రం మచిలీపట్నంలో శనివారం తెలుగుదేశం పార్టీ జిల్లా మినీ మహానాడు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు బచ్చుల అర్జునుడు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక సుల్తానగరం శ్రీరామరాజు కనె్వన్షన్ ఫంక్షన్ హాలులో ఉదయం 10గంటలకు ప్రారంభమయ్యే మినీ మహానాడుకు జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులు పాల్గొననున్నట్లు తెలిపారు. జిల్లాలో నెలకొన్న సమస్యలపై పూర్తి స్థాయిలో చర్చించి ముఖ్యమైన అంశాలను తిరుపతిలో జరిగే మహానాడు దృష్టికి తీసుకువెళతామన్నారు. మినీ మహానాడుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.