కృష్ణ

ఖరీఫ్ సాగుకు రైతన్న శ్రీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటర్), మే 22: ఖరీఫ్ సాగుకు రైతన్నలు శ్రీకారం చుట్టారు. జిల్లాలో రెండు రోజులు కురిసిన భారీ వర్షాలు వ్యవసాయ భూములను పూర్తిగా తడిపాయి. దీంతో ఖరీఫ్ దుక్కులకు ఆదివారం రైతన్నలు శ్రీకారం చుట్టారు. ట్రాక్టర్లతోనే కాకుండా సంప్రదాయబద్ధమైన ఎడ్లతో కూడా దుక్కి దున్నుతున్నారు. రెండు రోజులు భారీ వర్షం కురవడం, భూమి మెత్తబడటం, తరువాత మూడు రోజులు ఉష్ణోగ్రతలకు తేమ ఇంకిపోవడంతో దుక్కి బాగా రావటంతో రైతులు దుక్కులను ముమ్మరం చేశారు. ఈ సమయంలో దుక్కి దున్నితే అడుగు లోతుకు పైగా దుక్కి వస్తుందని, చీలపీడలను వృద్ధి చేసే గుడ్లు, పురుగుల లార్వాలు వేడికి నాశనం అవుతాయని, కలుపు జాతి మొక్కలు కూడా నశిస్తాయని అంటున్నారు. ఇలా దుక్కి దున్నటం వల్ల వ్యవసాయ భూములు గుల్లబారి వేరు వ్యవస్థ వృద్ధి చెందుతుందని, తద్వారా ఆరోగ్యవంతమైన పంట వస్తుందని వ్యవసాయ శాఖ పేర్కొంటోంది. అలాగే సాగునీరు కూడా ఆదా అవుతుంది. పచ్చిరొట్ట ఎరువును వేసుకునేందుకు అనువుగా ఉండటమే కాకుండా పిచ్చిమొక్కలు పెరగకుండా దోహదపడుతుంది. అయితే ప్రభుత్వం విడుదల చేసే సాగునీటిపై రైతులకు నమ్మకం లేకుండా పోయింది. గత ఖరీఫ్‌ను దృష్టిలో పెట్టుకుని ఆందోళన చెందుతున్నారు. గత ఖరీఫ్‌లో అనుకున్న సమయానికి సాగునీరు విడుదల చేసినా అనంతరం నీటిని విడుదల చేయలేక చేతులెత్తేశారు. దీంతో జిల్లాలో వేలాది ఎకరాల వ్యవసాయ భూములు ఖాళీగా ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధిక వ్యయం చేసి సాగు చేసిన పంటలు సైతం ఎండిపోయాయి. అపరాలకూ కొద్దిపాటి నీటిని కూడా వదలలేకపోయారు. గత ఖరీఫ్‌లో పడ్డ కష్టాలను తలుచుకుని ప్రస్తుత ఖరీఫ్ ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయిన కౌలురైతులు ఖరీఫ్ పైనే ఆశలు పెట్టుకున్నారు. గత ఖరీఫ్‌లో అప్పులు పూడ్చేందుకు ప్రస్తుత ఖరీఫ్ సాగుకు శ్రీకారం చుట్టారు. మరలా అధిక వడ్డీలకు అప్పులు చేసి సాగు చేపట్టేందుకు ముందుకొస్తున్నారు. ఇదిలావుండగా ఇన్ని కష్టాలు పడినా రబీలో మినుము సాగు చేసిన రైతులు మాత్రం పొలాలను చేసేందుకు ఎగబడుతున్నారు. వారు మినుము పంటలో కొంత మేర లాభాన్ని గడించారు. మినుముల ధరలు ఆశాజనకంగా ఉండటంతో కొంతమేర లాభాన్ని పొందారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఖరీఫ్ సాగు చేసేందుకు ముందుకొస్తున్నారు. ఖాళీగా పొలాలను వదిలేసిన రైతన్నలు అప్పులను పూడ్చుకునేందుకు ప్రస్తుత ఖరీఫ్‌కు సిద్ధమవుతున్నారు. ఏదిఏమైనా వర్షం రైతన్నలకు, ప్రజలకు మేలు చేసిందనే చెప్పాలి.