కృష్ణ

శాంతిభద్రతల పరిరక్షణలో జిల్లా బేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం: శాంతి భద్రతల పరిరక్షణలో జిల్లా పోలీసుల పనితీరు భేషుగ్గా ఉందని రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కితాబునిచ్చారు. మైలవరంలో 1.40 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన మోడల్ పోలీస్ స్టేషన్ భవనాన్ని మంత్రి ఉమ ఆదివారం రాత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో ఆయన మాట్లాడుతూ నేర పరిశోధన, చట్టాన్ని పరిరక్షించే విషయంలో జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి బృందం చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. ప్రభుత్వ పాలనకు పోలీస్ వ్యవస్థ పనితీరు గీటురాయి కాగలదన్నారు. అందుకే ప్రభుత్వం సైతం పోలీస్ వ్యవస్థకు పూర్తి స్వేచ్ఛ అందించి శాంతి భద్రతల పరిరక్షణలో వారి సేవలను వినియోగించుకుంటున్నట్లు తెలిపారు. మైలవరంలో అత్యాధునిక సౌకర్యాలతో మోడల్ పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేయటం అభినందనీయమన్నారు. రానున్న రోజుల్లో ఈ స్టేషన్ డివిజన్ స్థాయి స్టేషన్‌గా అభివృద్ధి చెంది అదే స్థాయిలో ప్రజలకు రాజకీయాలు, కుల మతాలకు అతీతంగా సేవలందించాలని ఆయన ఆకాంక్షించారు. అదేవిధంగా సామాన్యులకు అందుబాటులో పోలీస్ సేవలుండాలని, ప్రజలతో మమేకమై పని చేయాలని పోలీస్ వ్యవస్థ పట్ల ప్రజలకు నమ్మకం కలిగేలా పని చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, నూజివీడు డీఎస్పీ ప్రసాదరావు, మైలవరం సీఐ చింతా సూరిబాబు, సర్కిల్ పరిధిలోని మైలవరం, జి కొండూరు, ఎ కొండూరు, రెడ్డిగూడెం పోలీస్ స్టేషన్‌ల ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

మోదీ సభకు భారీగా వెళ్లిన బీజేపీ శ్రేణులు
అవనిగడ్డ, ఫిబ్రవరి 10: గుంటూరులో ఆదివారం ఉదయం నిర్వహించిన భారత ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభకు అవనిగడ్డ నుండి భారీగా కార్యకర్తలు తరలి వెళ్లారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జీవి నగరాయులు, భోగాది చంద్రశేఖర్, ఏడుకొండలు ఆధ్వర్యంలో ప్రత్యేక వ్యాన్‌లో కార్యకర్తలు భారీగా తరలి వెళ్లారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం అడ్డంకులు కల్పిస్తూ నియంత పోకడలు చేయటాన్ని వారు తీవ్రంగా గర్హించారు. ఇదే నియంత పోకడలు చంద్రబాబు కొనసాగిస్తే పుట్టగతులు ఉండవన్నారు.

నేటి నుండి క్రీడా పోటీలు
నాగాయలంక, ఫిబ్రవరి 10: మండలంలోని వివిధ పాఠశాలలకు చెందిన బాల, బాలికలకు ఈనెల 11వ తేదీ నుంచి 14వ తేదీ వరకు స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఆటల పోటీలు జరుగుతాయని మండల విద్యాశాఖాధికారి టివిఎం రా మదాసు ఆదివారం తెలిపారు. 15, 16 తేదీలలో ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులకు సెంట్రల్ జోన్ పోటీలు జరుగుతాయని ఆయన చెప్పారు. 17న ఉపాధ్యాయులకు క్రికెట్ పోటీలు కూడా నిర్వహిస్తామని రామదాసు వివరించారు.

16 నుండి మువ్వ వేణుగోపాలుని బ్రహ్మోత్సవాలు
కూచిపూడి, ఫిబ్రవరి 10: చారిత్రక ప్రసిద్ధిగాంచిన శ్రీ మువ్వ వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 16వ తేదీ నుండి 20వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం ఎఇఓ బి వెంకటరెడ్డి తెలిపారు. ఆదివారం ఆలయంలో బ్రహ్మోత్సవాల గోడ పత్రికలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దత్తత తీసుకున్న ఆలయాల అభివృద్ధికి తాము కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు ఆర్థికంగా బలపడిన ఆలయాల్లో ప్రత్యేక ఉత్సవాలు ద్వారా ప్రాచుర్యం కల్పిస్తున్నామన్నారు. ఆర్థికంగా లేని ఆలయాల పునరుద్దరణకు తమ దేవస్థానం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎ కెఎస్ పెరుమాళ్లు, ఆర్‌ఎ ఎ కృష్ణ, ఆలయ అర్చకులు దీవి సీతారామ హనుమాన్, వంశీమోహన్‌లు పాల్గొన్నారు.