కృష్ణ

వౌలిక సదుపాయాల కల్పనకే అధిక ప్రాధాన్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటరు): గడిచిన నాలుగున్నర యేళ్లుగా నియోజకవర్గంలో వౌలిక సదుపాయాల కల్పనకే అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఆదివారం స్థానిక 1వ వార్డులోని రామానగర్‌లో రూ.8.81 ఎస్‌డీఎఫ్ నిధులతో 228 మీటర్లు పొడవు, 3.50 మీటర్ల వెడల్పు కలిగిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల ప్రాంతాల్లో సైతం పక్కా రహదారులు, డ్రైనేజీ సదుపాయం కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, వైస్ చైర్మన్ పంచపర్వాల కాశీ విశ్వనాధం తదితరులు పాల్గొన్నారు.

మెరుగైన సేవలతో జిల్లా పరిషత్‌కు పేరు తేవాలి
* జెడ్పీ వైస్ చైర్‌పర్సన్ శాయన పుష్పవతి
మచిలీపట్నం (కోనేరుసెంటర్), ఫిబ్రవరి 10: మెరుగైన సేవలందించి జిల్లా పరిషత్‌కు పేరు ప్రతిష్ఠలు ఇనుమడింప చేయాలని జిల్లా పరిషత్ వైస్ చైర్‌పర్సన్ శాయన పుష్పవతి అన్నారు. జిల్లా పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో నిర్మించిన జెడ్పీ ఎంప్లాయిస్ కో-ఆపరేటీవ్ క్రెడిట్ సొసైటీ భవనాన్ని ఆదివారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా అభివృద్ధిలో పరిషత్ ఉద్యోగుల పాత్రే కీలకమన్నారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టే సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేసి ప్రజలకు మరింత చేరువ కావాలన్నారు. జెడ్పీ ఉద్యోగుల సంక్షేమానికి తమ పాలకవర్గం అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ లంకే నారాయణ ప్రసాద్, పంచాయతీ రాజ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, పీఆర్ నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి లక్ష్మయ్య, కో-ఆపరేటీవ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు డి విజయకుమార్, పీఆర్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు పివిఎస్ నాగేశ్వరరావు, కో-ఆపరేటీవ్ సొసైటీ మాజీ అధ్యక్షుడు యలమంచిలి రవీంద్రనాధ్, ప్రస్తుత అధ్యక్షుడు చలసాని అశోక్ కుమార్, కార్యదర్శి కళ్లేపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.